AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Artist Heroes: ఒకప్పుడు బాల నటులు.. ఇప్పుడు క్రేజి హీరోలు.. వారెవరు.?

టాలీవుడ్‌లో చాలామంది బాలనటులుగా  నటించారు, నటిస్తున్నారు కూడా. అయితే కొంతమంది మాత్రమే వారిలో పెద్దయ్యాక హీరోలుగానూ సక్సెస్ అవుతారు. మహేష్ బాబు దగ్గర నుండి తేజ సజ్జ వరకూ సక్సెస్ బాట పట్టిన హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగులో బాల నటులుగా ప్రూవ్ చేసుకున్న వారే. అలాంటి హీరోల గురించి ఈరోజు తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: May 24, 2025 | 4:50 PM

Share
ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మహేష్ బాబు. తన నాలుగేళ్ల వయసులోనే దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'నీడ' అనే చిత్రంతో బాల నటుడిగా పరిచయమై మొత్తంగా 11 ఏళ్లలో ముగ్గురు కొడుకులు, గూడాచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్నా తమ్ముడు వంటి 9 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి 1999లో 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసి సూపర్ స్టార్‌గా ఎదిగారు.

1 / 5
అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా చిన్నతనంలోనే బాల రామాయణం సినిమాలో రాముడుగా నటించి హిట్ అందుకున్నారు. అంతకుముందే బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరతుడిగా కనిపించారు. 2001లో "నిన్ను చూడాలని" చిత్రంతో టాలీవుడ్‌కి హీరోగా  పరిచయమై పాన్ ఇండియా హీరోగా అయిపోయారు తారక్.

2 / 5
ఇప్పుడు ఫామ్‎లో ఉన్న యంగ్ హీరో తేజ సజ్జ టాలీవుడ్‌లో బాలనటుడిగా చాలా సినిమాలు చేసారు. దాదాపు అందురు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‎గా మెప్పించారు. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా నటించి హిట్ అందుకున్నారు. గత ఏడాది హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ అందుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ సినిమా చేస్తున్నారు. అలాగే జై హనుమాన్ మూవీలో కూడా నటించనున్నారు.

3 / 5
మేజర్ చంద్రకాంత్, పుణ్య భూమి నా దేశం, అడవిలో అన్న, ఖైదీ వంటి సినిమాల్లో బాలనటుడిగా మెప్పించారు మంచు మనోజ్. 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి CineMAA ఉత్తమ మేల్ డెబ్యూ అవార్డు అందుకున్నారు. తర్వాత చల్ హిట్ సినిమాలు చేసి మళ్ళీ 7 ఏళ్ల గ్యాప్ తర్వాత భైరవం సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. దీంతో పాటు మిరాయ్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

4 / 5
అంజలి, తేజ, మనసు మమత, పిల్లలు దిద్దిన కాపురం లాంటి సినిమాల్లో బాల నటుడిగా రాణించిన టాలీవుడ్ హీరో అయ్యారు తరుణ్ కుమార్ . ఉత్తమ బాల నటుడిగా పలుమార్లు నంది అవార్డు కూడా అందుకున్నారు. 2000లో "నువ్వే కావాలి" చిత్రంతో  హీరోగా మారారు. తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి ఎన్నో లవ్ స్టోరీ సినిమాలు చేసి క్రేజీ హీరోగా ఎదిగారు. దాదాపు 30 ఏళ్ళు ఇండస్ట్రీలో నటుడిగా మెప్పించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.

5 / 5