తెల్ల చీరలో అందాల జాతర.. నిధి అగర్వాల్ ఎంత ముద్దుగుందో కదా..
తన కళ్లు, గ్లామర్‌తోనే మాయ చేసే బ్యూటీ నిధి అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తాజాగా తెల్ల చీరలో తన అందంచందాలతో మాయ చేస్తుంది. అచ్చం అప్సరలా ఉన్న ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: May 24, 2025 | 4:41 PM

బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. మార్వాడి కుటుంబంలో జన్మించిన ఈ చిన్నది మోడలింగ్ చేసి, తద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది.

2017 లో మున్నా మైఖేల్ అనే హిందీ సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన సవ్వసాచి అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో నటించినప్పటికీ ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు అనే చెప్పాలి.

అయితే సవ్య సాచి సినిమా డిజాస్టర్ సొంతం చేసుకున్నప్పటికీ ఇప్పడు మాత్రం తన గ్లామర్‌తో ఆకట్టుకుందనే చెప్పాలి. దీని తర్వాత ఈ అమ్మడుకు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఛాన్స్ లభించింది.

ఈ సినిమాతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. మూవీ కూడా హిట్ అవ్వడంతో తొలి హిట్ తన ఖాతాలో వేసుకొని, మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. కానీ ఊహించిన విధంగా బెస్ట్ అవకాశాలు మాత్రం ఈ అమ్మడు సొంతం చేసుకోలేకపోయింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టాలో చీరలో ఉన్న ఫొటోలు షేర్ చేసింది.అందులో ఈ బ్యూటీ తెల్ల చీరలో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



