చీరలో అందాల తారలా.. శ్రీలీల క్యూట్ ఫొటోస్
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ, అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. వరసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బీజీగా గడిపేస్తుంది ఈ చిన్నది.
Updated on: Nov 18, 2025 | 9:45 PM

యంగ్ బ్యూటీ అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన అందం, క్యూట్ నెస్‌తో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది. వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.

పెళ్లి సందD మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ, మొదటి సినిమాతో అందరి మనసు దోచేసింది. తన గ్లామర్, నటన, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు దక్కాయి.

తర్వాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి, ఆ మూవీలో తన డాన్స్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఇక దీని తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. అయితే ఈ అమ్మడు చేసిన చాలా సినిమాలో డిజాస్టర్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు, తర్వాత పుష్ప2లో ఐటమ్ సాంగ్‌తో మంచి ఫేమ్ తెచ్చుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఈ అందాల తారా, తాజాగా చీరలో తన అందంతో కుర్రకారు మనసు దోచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



