- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi Vishwambhara story reveal by director know the details
Vishwambhara: విశ్వంభర అప్‌డేట్… కథ మొత్తం రివీల్ చేసిన దర్శకుడు..
ప్రజెంట్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విశ్వంభర, గ్రాఫిక్స్ డిలే కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో అసలు ఈ సినిమా స్టేటస్ ఏంటన్న అనుమానాలు ఆడియన్స్‌లో క్రియేట్ అయ్యాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అన్ని అనుమానాలకు చెక్ పెట్టేశారు దర్శకుడు. ఇంతకీ ఆయన ఏం అన్నారు..?
Updated on: Jul 20, 2025 | 8:58 PM

చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా... విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఆలస్యం కావటంతో వాయిదా పడుతూ వస్తోంది.

చాలా కాలంగా అప్‌డేట్ కోసం అభిమానులు అడుగుతున్నా.. సెలైంట్‌గా ఉన్న మేకర్స్.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ ఇంటర్వ్యూలో విశ్వంభర షూటింగ్ స్టేటస్ గురించి, కథా కథనాల గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు వశిష్ఠ.

ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తయ్యిందన్న డైరెక్టర్, ఈ నెల 25 నుంచి ఆ పాట షూటింగ్ కూడా స్టార్ చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా 80 శాతానికి పైగా పూర్తయ్యిందన్నారు వశిష్ఠ.

విశ్వంభర కథ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు వశిష్ఠ. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు వెండితెర మీద చూపించని ఓ కొత్త లోకాన్ని సృష్టించామని చెప్పారు. మనకు తెలిసిన 14 లోకాలు కాకుండా.. మరో లోకం ఉంటే.. దాని పేరు విశ్వంభర అయితే ఎలా ఉంటుందన్న ఊహ నుంచే కథ పుట్టిందన్నారు.

హీరోయిన్‌ను ఎత్తుకుపోయిన విలన్, ఆమెను విశ్వంభర లోకానికి తీసుకెళ్తే... హీరో అక్కడి ఎలా వెళ్లాడు, హీరోయిన్‌ను ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ అని చెప్పారు. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా... అతి త్వరలో రిలీజ్ విషయంలో క్లారిటీ వస్తుందని చెప్పారు.




