- Telugu News Photo Gallery Cinema photos Boyapati Srinu Nandamuri Balakrishna akhanda 02 movie latest update
Akhanda 2: దద్దరిల్లే కాన్సెప్ట్ తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో రానున్న అఖండ 2..
సినిమాల షూటింగ్ విషయంలో ఆలస్యం జరుగుతుందంటే బోలెడన్ని కారణాలుంటాయి. హీరో, హీరోయిన్ల కాల్షీట్ సర్దుబాటు కాక కావచ్చు... లొకేషన్లు కుదరక కావచ్చు... స్క్రిప్ట్ పక్కాగా కుదరకపోవడం వల్లా కావచ్చు. కానీ అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న తర్వాత టోటల్ థీమ్‌నే మార్చాల్సి వస్తే... అప్పటిదాకా అనుకున్నదాన్ని ఇంకో రకంగా మార్చుకోవాల్సి వస్తే.. బాలయ్య అండ్ పవన్... ఒకే రకమైన ఇరకాటంలో పడ్డారా? మాట్లాడుకుందాం పదండి...
Updated on: Aug 03, 2024 | 8:43 AM

అఖండ సీక్వెల్‌తో ఎలాగైనా హిట్ కొట్టాల్సిందేనని కంకణం కట్టుకున్నారు బోయపాటి. ఆల్రెడీ గోపీచంద్‌తో తెరకెక్కిస్తున్న విశ్వం సినిమాతో మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చేయాలని కష్టపడుతున్నారు శ్రీనువైట్ల.

జస్ట్ అనడమే కాదు, యాజ్ ఇట్ ఈజ్‌గా చేసి చూపిస్తున్నారు. 2023ని అసలు మర్చిపోలేరు నందమూరి బాలకృష్ణ.

బోయపాటి డైరక్షన్‌లో బాలయ్య సినిమా చేస్తున్నారంటేనే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ రెడీ అవుతోందని అర్థం. అయితే ఈ సారి మాత్రం వంట దినుసులు మారుతున్నాయన్నది టాక్. ఆల్రెడీ యాంటీ గవర్నమెంట్ థీమ్‌తో కథను సిద్ధం చేశారట. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. అందుకే థీమ్‌ని కూడా మార్చే పనిలో పడ్డారట బోయపాటి. అందుకే అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లడానికి ఆలస్యం అవుతుందన్నది టాక్.

ఇప్పుడు సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆ థర్డ్ ప్రాజెక్ట్.. ఇంతకీ మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో.. అర్థమైందిగా.! యస్.. ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఉస్తాద్ భగత్‌సింగ్.

తాజాగా థమన్ ట్వీట్ చేసారు కాబట్టి కచ్చితంగా ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ ఉంటుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇక వీరమల్లు నుంచి ఓ టీజర్ వచ్చే అవకాశాలు కొట్టి పారేయలేం. ఉస్తాద్ భగత్ సింగ్ అప్‌డేట్‌పై హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వాల్సిందే..!




