- Telugu News Photo Gallery Cinema photos Bollywood Badshah Created History By Back To Back Hits With Pathaan Jawan Movies
Shah Rukh Khan: బ్యాక్ టు బ్యాక్ హిట్లతో షారుఖ్.. రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్ షా
ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఆయన మరో అరుదైన రికార్డు కోసం ట్రై చేస్తున్నారు. ఆయనే కాదు, ఆయన్ని ఆ పొజిషన్‌లో నిలబెట్టడానికి ఆయన టీమ్ అంతా రాత్రింబవళ్లు పనిచేస్తోంది. తాప్సీ కూడా తన వంతు సాయం చేస్తున్నారు. హ్యాట్రిక్ మూవీ డంకీ డీటైల్స్ చూద్దాం రండి.. పఠాన్ సినిమా విడుదలైనప్పుడు, ఎలాగైనా హిట్ వస్తే చాలనుకున్నారు షారుఖ్ అండ్ టీమ్.
Updated on: Sep 27, 2023 | 1:45 PM

ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఆయన మరో అరుదైన రికార్డు కోసం ట్రై చేస్తున్నారు. ఆయనే కాదు, ఆయన్ని ఆ పొజిషన్‌లో నిలబెట్టడానికి ఆయన టీమ్ అంతా రాత్రింబవళ్లు పనిచేస్తోంది. తాప్సీ కూడా తన వంతు సాయం చేస్తున్నారు. హ్యాట్రిక్ మూవీ డంకీ డీటైల్స్ చూద్దాం రండి..

పఠాన్ సినిమా విడుదలైనప్పుడు, ఎలాగైనా హిట్ వస్తే చాలనుకున్నారు షారుఖ్ అండ్ టీమ్. అప్పటికి నిఖార్సైన హిట్ చూసి నాలుగేళ్లయింది షారుఖ్. అందుకే పఠాన్ హిట్ కోసం అంతలా వెయిట్ చేశారు. వెయ్యి కోట్లను దాటిన ఇండియన్ మూవీస్‌లో జబర్దస్త్ గా ప్లేస్ కొట్టేసింది పఠాన్.

జవాన్ సినిమా పఠాన్‌ని బీట్ చేస్తుందా? లేదా?... జవాన్ రిలీజ్‌కి ముందు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన టాపిక్ ఇది. జవాన్ హిందీ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ నెంబర్ వన్ మూవీగా స్థానం సంపాదించుకుంది. అంటే అక్కడ పఠాన్ కలెక్షన్లను బిందాస్‌గా బీట్ చేసింది.

కాన్సెప్ట్, మేకింగ్... వీటన్నిటిని బట్టి ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ రావడం గొప్పేం కాకపోవచ్చు. కానీ తాను సెట్ చేసిన రికార్డును, సేమ్ ఇయర్ తానే బ్రేక్ చేయడం మాత్రం గొప్పే. అది షారుఖ్ విషయంలోనే జరిగింది.

యాక్షన్ సినిమాలతోనే ఆ రేంజ్ కలెక్షన్లు కొల్లగొడితే, ఎక్కడో ఎమోషన్స్ కీ, ఫ్యామిలీస్‌కి టచ్ అయ్యే సినిమాలు చేసే రాజ్‌కుమార్ హిరానీ రూపొందిస్తున్న డంకీ ఇంకెన్ని రికార్డులు సెట్ చేయాలి? డంకీ విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు గనుక డంకీ ఇంకో వెయ్యి కోట్ల సినిమా అయితే, ఒకే ఏడాది ఈ రేంజ్‌లో మూడు సినిమాలిచ్చిన ఏకైక హీరోగా... ఎవ్వరూ టచ్ చేయలేని పొజిషన్‌కి రీచ్ అవుతారు బాలీవుడ్ బాద్షా.




