- Telugu News Photo Gallery Cinema photos Kannappa Movie Schedule Full Swing In New Zealand Chandramukhi 2 Set To Release On September 28
న్యూజిలాండ్ లో కన్నప్ప.. మరి కొన్ని గంటల్లో విడుదల కానున్న చంద్రముఖి 2
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న స్కంద సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. ఫస్ట్ ట్రైలర్‌లో ఓన్లీ మాస్ చూపించిన ఈయన.. ఈ సారి కాస్త పొలిటికల్ టచ్‌తో పాటు ఫ్యామిలీ సీన్స్ కూడా బాగానే హైలైట్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. సెప్టెంబర్ 28న విడుదల కానుంది సినిమా. మంచు విష్ణు హీరోగా మహాభారతం టెలివిజన్ సిరీస్ దర్శకులలో ఒకరైన ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా కన్నప్ప. ఈ మధ్యే సినిమాను ప్రకటించిన ఈయన.. తాజాగా న్యూజిలాండ్‌లో వర్క్ మొదలు పెట్టారు. ఇందులో ప్రభాస్, నయనతార కూడా నటిస్తారని ప్రచారం జరుగుతుంది
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Sep 27, 2023 | 1:23 PM

Skanda: రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న స్కంద సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. ఫస్ట్ ట్రైలర్‌లో ఓన్లీ మాస్ చూపించిన ఈయన.. ఈ సారి కాస్త పొలిటికల్ టచ్‌తో పాటు ఫ్యామిలీ సీన్స్ కూడా బాగానే హైలైట్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. సెప్టెంబర్ 28న విడుదల కానుంది సినిమా.

Kannappa: మంచు విష్ణు హీరోగా మహాభారతం టెలివిజన్ సిరీస్ దర్శకులలో ఒకరైన ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా కన్నప్ప. ఈ మధ్యే సినిమాను ప్రకటించిన ఈయన.. తాజాగా న్యూజిలాండ్‌లో వర్క్ మొదలు పెట్టారు. ఇందులో ప్రభాస్, నయనతార కూడా నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

Sundeep Kishan: సందీప్ కిషన్ హీరోగా సివి కుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన మాయవన్ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో సివి కుమార్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఈ సినిమా రాబోతుంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Chandramukhi 2: లారెన్స్, కంగన రనౌత్ కాంబినేషన్‌లో పి వాసు తెరకెక్కించిన సినిమా చంద్రముఖి 2. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్రం నుంచి నీ కానవే అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేసారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించారు. చైతన్య ప్రసాద్ ఈ పాటకు లిరిక్స్ అందించారు.

A.R. Murugadoss: ఒకప్పుడు సంచలన విజయాలతో దూసుకుపోయిన ఏఆర్ మురుగదాస్ చాలా కాలం గ్యాప్ తర్వాత కొత్త సినిమా ప్రకటించారు. యువ హీరో శివకార్తికేయన్‌తో మురుగదాస్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక వీడియో విడుదల చేసారు మేకర్స్. చివరగా 2020లో దర్బార్ సినిమాతో వచ్చారు మురుగదాస్.





























