Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లోకి టాలీవుడ్ కుర్ర హీరోయిన్.. మొన్నే హిట్టు కొట్టి అప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తోంది..
మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఈ రియాల్టీ షో కోసం సర్వం సిద్ధమయిపోయింది. ఇప్పటివరకు 6 సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో.. ఇవాళ సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు. ఈసారి హౌస్ లోకి టాలీవుడ్ కుర్ర హీరోయిన్ రితిక నాయక్ అడుగుపెట్టనున్నారు. ఇప్పడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న రితిక నాయక్...కెరీర్ ఆరంభంలోనే బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇప్పటికే బిగ్‌బాస్ సీజన్ 7లోకి రితిక అడుగుపెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




