- Telugu News Photo Gallery Cinema photos Beautiful photos of Meena in a simple way at her friend's wedding
స్నేహితురాలి పెళ్లిలో సింపుల్‌గా మీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీన గురించి ఎంత చెప్పినా తక్కువే.రోజా వే చిన్ని రోజావే అంటూ ఆ రోజుల్లో కుర్రకారు మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ. అచ్చం తెలుగు ఇంటి అమ్మాయిలా కనిపించే ఈ బ్యూటీ చాలా సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన ఫొటోలు షేర్ చేసిది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: May 12, 2025 | 3:53 PM

అందాల ముద్దుగుమ్మ సీనియర్ నటి మీనా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నటి చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపైకి అడుగు పెట్టి,స్టార్ హీరోయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుకుంది.1982లో వచ్చిన తమిళ సినిమా నెంజంగల్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ఇలా చాలా భాషల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అంతే కాకుండా ముఖ్యంగా రజనీకాంత్ సినిమాల్లో నటించి తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది.

తర్వాత తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, రాజశేఖర్, నాగార్జున, వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్సినిమాల్లో కూడా నటించి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

పెళ్లి చేసుకొని కొన్ని రోజుల పాటు చిత్ర పరిశ్రమకు దూరమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత దృశ్యం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక కొన్ని రోజుల తర్వాత ఈ బ్యూటీ భర్త కరోనాతో మరణించడంతో మీనా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన స్నేహితురాలి పెళ్లిలో దిగిన పలు ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ సింపుల్ లుక్‌లో చాలా ఆనందంగా ఉంది.



