- Telugu News Photo Gallery Cinema photos Beautiful photos of Nainika in saree with increased glamour dose
వామ్మో నైనిక ఏంటీ ఇలా మారిపోయింది.. గ్లామర్ డోస్ పెంచేసిందిగా..
ఢీ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగుమ్మ నైనిక గురిచి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. తాజాగా ఈ బ్యూటీ చీరలో తన అందాలతో కుర్రకారును మాయ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: May 12, 2025 | 2:58 PM

తన డ్యాన్స్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, అందంతో మంచి ఫేమ్ సంపాదించుకున్న చిన్నది నైనిక. ఈ బ్యూటీ స్మైల్‌కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకొని,మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా పలు షోలలో కూడా డ్యాన్స్ చేసి తన డ్యాన్స్ తో ఆకట్టుకుంది.

తర్వాత బిగ్ బాస్ లో అవకాశం రావడంతో తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది. వెళ్లిన మొదటి వారంలో తన ఆట తీరుతో ప్రతి ఒక్కరినీ తన వైపుకు లాక్కుంది. దీంతో ఈ అమ్మడే విన్నర్ అవుతారని అందరూ ఊహించారు. కానీ తర్వాత ఆట కాస్త దగ్గించింది ఈ బ్యూటీ.

దీంతో మూడు వారలకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. యూట్యూబ్‌లో తనకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య గ్లామర్ కూడా పెంచి తన అందంతో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. తాజాగ ఈ బ్యూటీ చీరలో తన అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది.కుందనపు బొమ్మలా తయారై తన అందంతో ఆగం చేస్తుంది.

ప్రస్తుతం దీనికిసంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసినవారందర నైనిక గ్లామర్ డోస్ పెంచింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



