- Telugu News Photo Gallery Cinema photos Beautiful photos of Kajal Aggarwal enjoying vacation with her husband
భర్తతో ఆనందంగా.. అదరిపోయే లుక్‌లో కాజల్ అగర్వాల్
అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి, పలు సినిమాల్లో సత్తా చాటుతున్నఈ ముద్దుగుమ్మ తాజాగా, తన భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Nov 06, 2025 | 6:56 AM

అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిన్నది అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ అందాల తార.

లక్ష్మీ కళ్యాణం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత చందమామ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. తన అందంతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది.

ఇక ఈ బ్యూటీని మాత్రం ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ చేసిన సినిమా మగధీర, ఈ మూవీలో ఈ అమ్మడు మిత్రవిందగా తన అందం, నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొని స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

టాలీవుడ్ స్టార్ హీరోల అందరిసరసన నటించి మెప్పించి, చాలా రోజుల పాటు, టాలీవుడ్‌లో ఈ బ్యూటీ వరసగా సినిమాలు చేస్తూ సందడి చేసింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొడుకుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

కొన్ని రోజుల పాటు, కొడుకు, ఫ్యామిలీతో గడిపిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి, పలు సినిమాలతో తన అభిమానులను పలకరిస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. అవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.



