- Telugu News Photo Gallery Cinema photos Balakrishna with Bhagavanth Kesari movie scores hattrick with record 100 crore collection
Bhagavanth Kesari: వరుసగా మూడో సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. ఆ విషయంలో బాలయ్య మరో అరుదైన రికార్డ్
నీ టైమ్ నడుస్తుంది బాబూ.. ఏం ముట్టుకున్నా బంగారం అవుతుంది.. నడిపించండి నడిపించండి అంటున్నారు ఇప్పుడు బాలయ్య అభిమానులు. 60 ఏళ్ళు దాటిన తర్వాత అదృష్టం కలిసొచ్చింది. దానికి ముందు కూడా బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు NBK 2.0 వర్షన్ బయటికొచ్చింది. తాజాగా సీనియర్ హీరోలలో ఎవరికీ సాధ్యం కాని మరో రికార్డ్ అందుకున్నారీయన. క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నట్లు.. ఇక్కడ బాలయ్య కూడా ఇదే చేస్తున్నారు. వరసగా సెంచరీల మోత మోగిస్తున్నారు. 60 దాటిన తర్వాత గ్రౌండ్‌లో అదరగొడుతున్నారు NBK.
Updated on: Oct 27, 2023 | 2:15 PM

నీ టైమ్ నడుస్తుంది బాబూ.. ఏం ముట్టుకున్నా బంగారం అవుతుంది.. నడిపించండి నడిపించండి అంటున్నారు ఇప్పుడు బాలయ్య అభిమానులు. 60 ఏళ్ళు దాటిన తర్వాత అదృష్టం కలిసొచ్చింది. దానికి ముందు కూడా బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు NBK 2.0 వర్షన్ బయటికొచ్చింది. తాజాగా సీనియర్ హీరోలలో ఎవరికీ సాధ్యం కాని మరో రికార్డ్ అందుకున్నారీయన.

క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నట్లు.. ఇక్కడ బాలయ్య కూడా ఇదే చేస్తున్నారు. వరసగా సెంచరీల మోత మోగిస్తున్నారు. 60 దాటిన తర్వాత గ్రౌండ్‌లో అదరగొడుతున్నారు NBK.

అఖండ తర్వాత వర్షన్ 2.0 చూపిస్తున్న ఈయన.. తాజాగా మరో అరుదైన రికార్డ్ అందుకున్నారు. భగవంత్ కేసరితో వరసగా మూడోసారి 100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టారీయన.

అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదలైంది. అఖండ, వీరసింహారెడ్డితో పోలిస్తే దీనికి ఓపెనింగ్స్ తక్కువగానే వచ్చాయి. అయితే సెలవులు పూర్తయ్యాక.. బాలయ్య ఆట షురూ అయింది. రోజురోజుకీ కేసరికి క్రేజ్ పెరుగుతుంది. తాజాగా 6 రోజుల్లోనే 100 కోట్ల మైలురాయి అందుకుంది భగవంత్ కేసరి. వరసగా మూడోసారి సెంచరీ కొట్టిన ఏకైక సీనియర్ బాలయ్యే.

1990లో నారినారి నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్ తర్వాత బాలయ్య హ్యాట్రిక్ కొట్టలేదు. 33 ఏళ్ళ తర్వాత అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకోవడమే కాదు.. వరసగా 3 సెంచరీలు కొట్టారీయన. అంతేకాదు.. ఓవర్సీస్‌లో ఈ మూడూ 1 మిలియన్ మార్క్ అందుకున్నాయి. అదీ ఓ రికార్డ్. మొత్తానికి బాలయ్య ఫుల్ స్పీడ్‌లో ఉన్నారిప్పుడు.




