- Telugu News Photo Gallery Cinema photos Atlee next action drama to be multi starrer with Rajinikanth and Salman Khan
Salman Khan: సల్మాన్ అట్లీ సినిమాలో సౌత్ హీరో !! ఎవరంటే ??
సౌత్ డైరక్టర్లకి ఇప్పుడు నార్త్ లో జబర్దస్త్ క్రేజ్ ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు సల్మాన్ ఖాన్. అందుకే తాను కూడా ట్రెండ్‌లో ఉండటానికే ఇష్టపడుతున్నారు. దక్షిణాది దర్శకులు చెప్పిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తార్ మార్ టక్కర్ మార్ అనిపించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో తార్ మార్ టక్కర్ మార్ అంటూ స్టెప్పులేశారు నార్త్ సినిమా సుల్తాన్ మిస్టర్ సల్మాన్‌ఖాన్.
Updated on: Jul 06, 2024 | 9:41 PM

సౌత్ డైరక్టర్లకి ఇప్పుడు నార్త్ లో జబర్దస్త్ క్రేజ్ ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు సల్మాన్ ఖాన్. అందుకే తాను కూడా ట్రెండ్‌లో ఉండటానికే ఇష్టపడుతున్నారు. దక్షిణాది దర్శకులు చెప్పిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తార్ మార్ టక్కర్ మార్ అనిపించుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో తార్ మార్ టక్కర్ మార్ అంటూ స్టెప్పులేశారు నార్త్ సినిమా సుల్తాన్ మిస్టర్ సల్మాన్‌ఖాన్. ఎట్ ప్రెజెంట్ ఈయన నటిస్తున్న సినిమా సికిందర్. మురుగదాస్ డైరక్షన్‌లో సికిందర్‌లో నటిస్తున్నారు.

యానిమల్‌తో నార్త్ లో చెలరేగిపోయిన రష్మిక మందన్న... ఇప్పుడు సికిందర్‌తో జోడీ కడుతున్నారు. ఈ సినిమా తర్వాత అట్లీ డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తారనే టాక్ నడుస్తోంది. ఆల్రెడీ అట్లీ పాయింట్ చెప్పారట.

జవాన్ సినిమా రన్నింగ్‌లో ఉన్నప్పుడే అట్లీ దగ్గర ఏమైనా కొత్త పాయింట్స్ ఉన్నాయేమోనని ఆరా తీశారట సల్మాన్. ఆయనకు తగ్గ కథను ఇటీవల లైన్ రూపంలో చెప్పారట జవాన్ కెప్టెన్.

సల్మాన్‌తో అట్లీ తెరకెక్కించబోయే సినిమా ప్యాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఉంటుందనే టాక్ ఉంది. ఈ సినిమాలో నార్త్ నుంచి సల్మాన్‌ఖాన్, సౌత్ నుంచి మరో స్టార్ హీరో నటిస్తారని టాక్. నార్త్, సౌత్‌కి సంబంధించి భారీ కొలాబరేషన్‌గా ఈ మూవీ ఉంటుందన్నది ఇప్పుడు నార్త్ లో వైరల్ న్యూస్.




