- Telugu News Photo Gallery Cinema photos As 4 films are coming for Sankranti, the buyers are not getting enough sleep.
Sankranthi Movies: సంక్రాంతికి 4 సినిమాలు.. ఫ్యాన్స్ కేరింతలు.. బయ్యర్లకు చుక్కలు..
సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయని అభిమానులు పండగ చేసుకుంటున్నారు కానీ బయ్యర్లకు మాత్రం నిద్ర పట్టట్లేదు.. మరోవైపు ఈ పోటీ చూసాక నిర్మాతలకు కంటి మీద కునుకు కష్టమే. ఎందుకంటే అక్కడెవర్నీ తక్కువంచనా వేయడానికి లేదు. పైగా బరిలో ఉన్నవి భారీ సినిమాలు.. మరి ఈ పోరును థియేటర్ల పరంగా ఎలా డివైడ్ చేయబోతున్నారు..? అసలు అది సాధ్యమేనా..?
Updated on: Nov 12, 2024 | 8:46 AM

అన్ ప్రెడిక్టబుల్.. అన్‌ప్రెడిక్టబుల్.. గేమ్‌చేంజర్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచీ ఈ మాట పాపులర్ అవుతోంది. అంతగా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఏం ఉండబోతోంది సినిమాలో..

మిగిలిన మూడు సినిమాలు మాత్రం సంక్రాంతి పండక్కి వస్తున్నామని చెప్పారు కానీ డేట్స్ చెప్పలేదు. జనవరి 10 నుంచి 15 మధ్యలోనే అన్ని సినిమాలు వస్తున్నాయి. ఎప్పుడన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

జనవరి 10న గేమ్ ఛేంజర్ వస్తే.. దాన్ని బేస్ చేసుకుని ముందు వెనక తమ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఉదాహరణకు NBK109 జనవరి 11 లేదంటే 13కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే వెంకీ సినిమాను జనవరి 14న ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది.

మరి ఇక సందీప్ కిషన్ మజాకా అన్నింటికంటే చివరగా విడుదల కానుంది. సంక్రాంతి సినిమాలన్నింటినీ బడా నిర్మాతలే బ్యాకప్ చేస్తున్నారు. ఈ లెక్కన ఎవరికీ థియేటర్స్ ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు.

కానీ ఒకేసారి ఇన్ని సినిమాలు వచ్చినపుడు కచ్చితంగా అనుకున్న దానికంటే తక్కువ స్క్రీన్స్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దానివల్ల వసూళ్లు కూడా దారుణంగా తగ్గిపోతుంటాయి. 2025 సంక్రాంతికి ఏ సినిమా ఎలా ఉన్నా.. కలెక్షన్లపై ఈ ప్రభావం అయితే పడటం ఖాయం.





























