సన్నని మెరుపు తీగ లాంటి పిల్ల అనన్య పాండే. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే అనన్య మాత్రం నాజూకు అందాలు ఆరబోస్తూ.. విజయ్ దేవరకొండతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది.