Ambani Wedding: పెళ్లి కూతురిగా రాధిక మర్చంట్.. చూపులన్నీ ఆమెపైనే.. రెండు కళ్లు చాలవంతే..
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నేడు. ప్రముఖ ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌తో కలిసి అనంత్ అంబానీ ఏడడుగులు వేయనున్నాడు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో నిర్వహించనున్న ఈ వివాహ వేడుకలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు.