- Telugu News Photo Gallery Cinema photos NTR Devara to Sudheer Babu Harom Hara latest movie updates from Tollywood Film Industry
Movie Updates: దేవర సెట్లో శ్రుతి జాయిన్.. హరోంహర ఓటీటీ..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వీడి12. బికినీలతో ఫొటో షూట్‌లు చేసి ఇండస్ట్రీలో ఎదగాలనుకోలేదని అన్నారు నటి మనీషా కొయిరాలా. సహజ నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని అన్నారు నటి రష్మిక మందన్న. సుధీర్‌బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన సినిమా హరోం హర. ఆ మధ్య థియేటర్లలో విడుదలైంది.
Updated on: Jul 12, 2024 | 3:56 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా దేవర అయినట్టు తెలిపారు శ్రుతి మరాఠే. దేవరలో తారక్ భార్య పాత్రలో నటిస్తున్నారు శ్రుతి. సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతోంది దేవర పార్ట్ ఒన్.

ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం ఆయన శ్రీలంక చేరుకున్నారు. శ్రీలంకలో రౌడీ హీరోకు ఘన స్వాగతం లభించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది.

బికినీలతో ఫొటో షూట్‌లు చేసి ఇండస్ట్రీలో ఎదగాలనుకోలేదని అన్నారు నటి మనీషా కొయిరాలా. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాలను ఇటీవల పంచుకున్నారు మనీషా. బికినీతో ఫొటోషూట్ చేయమని ఫొటోగ్రాఫర్ చేసిన ఆఫర్ గురించి చెప్పారు. కానీ, తాను అందుకు ఒప్పుకోలేదని, తాను నమ్మిన సిద్ధాంతాలతోనే ఇండస్ట్రీలో ఎదిగాననీ అన్నారు మనీషా.

సహజ నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని అన్నారు నటి రష్మిక మందన్న. తాను సినిమాల్లోకి రాకముందు నుంచే సౌందర్యకు వీరాభిమానినని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఇంతటి కెరీర్‌ని ఊహించలేదని అన్నారు. తనను సౌందర్యతో పోల్చి చాలా మంది ప్రశంసిస్తుంటే, ఆనందంగా ఉంటుందని చెప్పారు.

సుధీర్‌బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన సినిమా హరోం హర. ఆ మధ్య థియేటర్లలో విడుదలైంది. కుప్పం యాసతో తెరకెక్కింది. సుధీర్‌బాబు గన్‌స్మిత్‌గా నటించిన మూవీ ఇది. ఈ చిత్రాన్ని త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన హరోం హరలో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే అంశాలు చాలానే ఉన్నాయన్నారు మేకర్స్.




