- Telugu News Photo Gallery Cinema photos Akshay Kumar Tiger Shroff bade miyan chote miyan trailer details
జోనర్ మార్చని బాలీవుడ్ హీరోలు.. స్పై యూనివర్స్ నుంచి బయటికి రమ్మంటున్న ఫ్యాన్స్
భారతదేశం నా మాతృభూమి.. దాన్ని కాపాడుటే మా ధ్యేయము..! ఇదేం స్కూల్ కాదుగా ఇప్పుడెందుకు ఈ ప్రేయర్ అనుకుంటున్నారా..? ఇది మన ప్రతిజ్ఞ కాదు.. బాలీవుడ్ హీరోలది. వాళ్లకు వేరే కథలే దొరకట్లేదనుకుంటా..! అందుకే ప్రతీ హీరో సైనికుడుగా మారిపోతున్నారు. తాజాగా మరో సినిమా అదే జోనర్‌లో వచ్చేస్తుంది. అసలు బాలీవుడ్ ఈ మత్తులోంచి బయటపడదా..? మరో జోనర్ ఏదీ లేనట్లు బాలీవుడ్‌లో ప్రతీ హీరో దేశాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటున్నారు.
Updated on: Mar 30, 2024 | 12:30 PM

భారతదేశం నా మాతృభూమి.. దాన్ని కాపాడుటే మా ధ్యేయము..! ఇదేం స్కూల్ కాదుగా ఇప్పుడెందుకు ఈ ప్రేయర్ అనుకుంటున్నారా..? ఇది మన ప్రతిజ్ఞ కాదు.. బాలీవుడ్ హీరోలది. వాళ్లకు వేరే కథలే దొరకట్లేదనుకుంటా..!

అందుకే ప్రతీ హీరో సైనికుడుగా మారిపోతున్నారు. తాజాగా మరో సినిమా అదే జోనర్‌లో వచ్చేస్తుంది. అసలు బాలీవుడ్ ఈ మత్తులోంచి బయటపడదా..? మరో జోనర్ ఏదీ లేనట్లు బాలీవుడ్‌లో ప్రతీ హీరో దేశాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటున్నారు.

మాట్లాడితే స్పై యూనివర్స్ అంటున్నారు. తాజాగా బడేమియా చోటేమియా ట్రైలర్ విడుదలైంది. ఇది కూడా దేశాన్ని కాపాడే ఇద్దరు సైనికుల కథే. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తుంటే.. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు.

భారత దేశానికి సంబంధించిన పవర్ ఫుల్ఆయుధాన్ని పృధ్వీరాజ్ దొంగిలిస్తారు. మూడ్రోజుల్లోనే దాన్ని తిరిగి తెచ్చే బాధ్యత అక్షయ్, టైగర్ ష్రాఫ్‌లకు అప్పగిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. టైగర్ జిందా హై ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దీనికి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే అదే స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్నట్లే అనిపిస్తుంది.

ఈ మధ్య స్టార్ హీరోలంతా స్పై కథల వైపు అడుగేస్తున్నారు. వార్, పఠాన్, టైగర్ 3, ఫైటర్, జవాన్.. ఇప్పుడు బడే మియా ఛోటే మియా.. రేపు రాబోయే వార్ 2.. ఇవన్నీ స్పై యూనివర్స్ కథలే. తెలుగులోనూ ఏజెంట్, గూడఛారి, స్పైడర్, డెవిల్ లాంటి సినిమాలు కూడా ఈ కాన్సెప్టులో వచ్చినవే. మొత్తానికి హిట్ ఫ్లాపులతో పనిలేకుండా హీరోలంతా స్పైగా మారిపోతున్నారిప్పుడు.




