- Telugu News Photo Gallery Cinema photos After announcement of Till Cube, audience is focusing on the upcoming Threequel Movies
Threequel Movies: టిల్లుగాని రాకతో త్రీక్వెల్స్ మీద ఫోకస్.. మరి ఆ సినిమాలు ఏంటి.?
టిల్లు స్క్వేర్ అలా స్క్రీన్ మీదకు వచ్చిందో లేదో... ఇలా రకరకాల విషయాలను ట్రెండింగ్‌లోకి తెచ్చేసింది. అందులో మోస్ట్ ఇంట్రస్టింగ్ టాపిక్ టిల్లు క్యూబ్. ఈ మూవీతో పాటు క్రేజ్ తెచ్చుకున్న మిగిలిన త్రీక్వెల్స్ మీద ఫోకస్ పెంచుతున్నారు ఆడియన్స్. అయితే ఈ రేంజ్ క్రేజ్ ఉన్న త్రీక్వెల్ సినిమాలు ఏంటి.? అవన్నీ ఎప్పుడు రానున్నాయి.? వాటి సంగతి ఏంటో.? ఈ స్టోరీలో చూద్దాం..
Updated on: Apr 03, 2024 | 9:29 AM

డీజే టిల్లు కాన్సెప్ట్ కి త్రీక్వెల్ ఉందనే విషయాన్ని, టిల్లు స్క్వయర్ క్లైమాక్స్ లో రివీల్ చేశారు మేకర్స్. ఫస్ట్ , సెకండ్ పార్టులతోనే కలెక్షన్ల దుమ్ములేపింది టిల్లు కంటెంట్. ఒకదాన్ని మించేలా ఇంకో సినిమాను తెరకెక్కించి, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పొరుగు క్రిటిక్స్ దృష్టిని కూడా ఆకర్షించారు మేకర్స్.

ఇంతకు ముందు ఈ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న సినిమా కేజీయఫ్. ఫస్ట్ పార్టు ఎలాంటి ఎక్స్ పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయింది. సీను సీనుకీ సీటీ కొట్టించాయి రాకీ భాయ్ యాక్షన్ సీక్వెన్స్. వాటికి తోడు డైలాగులు, పాటలు, ఎలివేషన్స్.. అన్నీ సీక్వెల్ మీద ఇంట్రస్ట్ పెంచాయి.

కేజీయఫ్2 క్లైమాక్స్ లో అంత బంగారాన్ని తీసుకుని సముద్ర ప్రయాణం స్టార్ట్ చేశాడు రాకీ భాయ్. అక్కడి నుంచి అతను ఏ తీరానికి చేరుకున్నాడు? అనేదే ఆసక్తి. ఈ సారి ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగిన రాకీ భాయ్‌ని చూపిస్తారా ప్రశాంత్‌నీల్? అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సలార్ సీక్వెల్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేసిన ప్రశాంత్ నీల్, పనిలో పనిగా కేజీయఫ్ త్రీక్వెల్ కాన్సెప్ట్ మీద కూడా కృషి చేస్తున్నారన్నది శాండిల్‌వుడ్ టాక్.

కోలీవుడ్ నుంచి కూడా ఓ త్రీక్వెల్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం భారతీయుడు సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు శంకర్. అయితే, ఆయన పనిలో పనిగా త్రీక్వెల్ షూటింగ్ కూడా పూర్తి చేశారన్నది కోడంబాక్కం న్యూస్.

సీక్వెల్ రిలీజ్ అయిన వెంటనే త్రీక్వెల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడుతుందట టీమ్. సో... కాస్త గ్యాప్ తీసుకుని, ఈ త్రీక్వెల్స్... ఆడియన్స్ కి సూపర్‌హిట్ కాన్సెప్టులను గుర్తుచేయబోతున్నాయన్నమాట.




