Adivi Sesh: స్లో అండ్ స్టడీ గా అడవి శేష్.. అప్ కమింగ్ మూవీ అప్డేట్స్
అడివి శేష్ కాంపౌండ్ నుంచి చాలా రోజులు తరువాత ఓ అప్‌డేట్ వచ్చింది. ఆ మధ్య వరుస సినిమాలతో హల్ చల్ చేసిన ఈ యంగ్ హీరో తరువాత కాస్త స్లో అయ్యారు. హరీ బరీగా సినిమాలు తీసేయటం కన్నా.. కాస్త స్లో అండ్ స్టడీగా కెరీర్ ప్లాన్ చేసుకోవటం బెటర్ అని ఫీల్ అయ్యారు. అందుకే చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు కొత్త సినిమాతో రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
Updated on: May 27, 2025 | 6:55 PM

అందుకే చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు కొత్త సినిమాతో రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.క్షణం, ఎవరు, గూడఛారి, మేజర్ లాంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో అడివి శేష్.

కథల ఎంపిక నుంచి మేకింగ్, టేకింగ్, ప్రమోషన్ ఇలా ప్రతీ విషయంలోనూ తనదైన మార్క్ చూపించే శేష్ తన నెక్ట్స్ మూవీతో ఆడియన్స్‌కు మరో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు.

నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో డెకాయిట్ అనే మూవీ చేస్తున్నారు శేష్. చాలా రోజుల క్రితమే ఎనౌన్స్ అయిన ఈ సినిమాలో ముందు శ్రుతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.

కానీ అనివార్య కారణాల వల్ల శ్రుతి తప్పుకోవటం ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ఫైనల్‌గా మృణాల్ ఠాకూర్ ఫీమేల్ లీడ్ రోల్‌లో డెకాయిట్ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

సోమవారం రిలీజ్ అయిన ఫైర్ గ్లింప్స్ టీజర్‌తో సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా ఈ థ్రిల్లర్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ సినిమాతో మరోసారి శేష్ సర్‌ప్రైజ్ చేస్తారేమో చూడాలి.




