- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha Won Miss Chennai In 1999 At Age Of 16 Photos Goes Viral
Actress Trisha: 16 ఏళ్ల వయసులోనే ఆ రికార్డ్ సృష్టించిన త్రిష.. అస్సలు ఊహించలేదుగా..
సౌత్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన త్రిష.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళం భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ సత్తా చాటుతుంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
Updated on: Feb 26, 2025 | 11:48 AM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ త్రిష. 41 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తుంది. ఇటీవలే అజిత్ జోడిగా విడాముయార్చి సినిమాతో అలరించిన త్రిష.. ఇప్పుడు చిరు సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.

చెన్నైలో జన్మించిన త్రిష.. చిన్నవయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1999లో నటుడు ప్రశాంత్ నటించి జోడి చిత్రంలో చిన్న పాత్రతో తన సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఇందులో హీరోయిన్ సిమ్రాన్ స్నేహితురాలిగా కనిపించింది.

ఆ తర్వాత దాదాపు మూడేళ్లకు కథానాయికగా త్రిషకు అవకాశాలు వచ్చాయి. 2002లో మౌనం పెసియాతే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంది.

25 ఏళ్ల సినీప్రయాణంలో త్రిష ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు జోరు కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఆమె చేతిలో ఏకంగా 5 సినిమాలు ఉన్నాయి.

అయితే త్రిష 1999 సెప్టెంబర్ 30న జరిగిన మిస్ చెన్నై పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. అప్పుడు ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులోనే మిస్ చెన్నైగా నిలిచి అరుదైన రికార్డ్ సృష్టించింది త్రిష.




