- Telugu News Photo Gallery Cinema photos Actress Shruti Haasan joined in rajinikanth's coolie movie shooting Telugu Heroines Photos
Shruti Haasan: అలాంటి తేడాలు చూడనంటున్న శ్రుతిహాసన్.! ఆయనతో ఫస్ట్ టైం..
''సీనియర్ ఏంటి? జూనియర్ ఏంటి? కథ ఎలా ఉంది? అందులో నా కేరక్టర్ ఏంటి? అనేది చూసుకోవాలిగానీ..'' అని ఇప్పటికే చాలా సార్లు చెప్పేశారు నటి శ్రుతిహాసన్. లేటెస్ట్ గా ఆమె రజనీకాంత్‌తో నటిస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రజనీకాంత్ దిగిన ఫుటేజ్ వైరల్ అయింది. ఇప్పుడు ఈ సెట్స్ లో శ్రుతిహాసన్ కూడా జాయిన్ అయ్యారు.
Updated on: Jul 07, 2024 | 6:42 PM

''సీనియర్ ఏంటి? జూనియర్ ఏంటి? కథ ఎలా ఉంది? అందులో నా కేరక్టర్ ఏంటి? అనేది చూసుకోవాలిగానీ...'' అని ఇప్పటికే చాలా సార్లు చెప్పేశారు నటి శ్రుతిహాసన్. లేటెస్ట్ గా ఆమె రజనీకాంత్‌తో నటిస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రజనీకాంత్ దిగిన ఫుటేజ్ వైరల్ అయింది. ఇప్పుడు ఈ సెట్స్ లో శ్రుతిహాసన్ కూడా జాయిన్ అయ్యారు.

తాను కూలీ సెట్లో ఉన్న సంగతిని పోస్ట్ చేసి, తర్వాత డిలీట్ చేశారు కమల్ డాటర్. రజనీకాంత్‌తో కలిసి శ్రుతిహాసన్ ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. టాలీవుడ్‌లో సీనియర్ హీరోలతో జోడీ కట్టడం శ్రుతికి బాగా అలవాటే.

గతేడాది చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో నటించారు. బాలకృష్ణతో వీరసింహారెడ్డిలో జోడీ కట్టారు. సంక్రాంతికి బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఓ వైపు సలార్ సినిమాలో ప్రభాస్‌తో నటిస్తున్నారు..

సీనియర్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందనే భయం లేదా? అనే ప్రశ్న గతంలో ఎదురైంది శ్రుతికి. ''నా పని తప్ప, పక్కవారి పనిని నేనసలు పట్టించుకోను. హీరోలు, వాళ్ల వయసు, వ్యక్తిగత వ్యవహారాలను పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ కథేంటి? అందులో నేను ఫిట్ అవుతానా? లేదా? అని ఆలోచిస్తే సరిపోతుంది కదా.

నేను దేని గురించి ఓవర్‌గా థింక్ చేయను'' అని సమాధానం ఇచ్చారు మిస్ హాసన్. ఇప్పుడు ఆమె కూలీలో రజనీకాంత్‌కి జోడీగా నటిస్తున్నారా? లేకుంటే కీలక పాత్రలో కనిపిస్తారా? అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఇటీవల లోకేష్ కనగరాజ్‌తో కలిసి 'ఇనిమే' అనే వీడియో సాంగ్స్ చేశారు శ్రుతిహాసన్.

ఆ పరిచయంతోనే కూలీ కాన్సెప్ట్ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆల్రెడీ విడుదలైన కూలీ అనౌన్స్ మెంట్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. కూలీ కాన్సెప్ట్ లోకేష్ కనగరాజ్ యూనివర్శ్‌ని టచ్ చేస్తుందా? లేదా? అనే ఆసక్తి కూడా జనాల్లో ఉంది.




