- Telugu News Photo Gallery Cinema photos Actress mehreen pirzada shared her latest stunning photos on social media
Mehreen Pirzada: సినిమాల్లేవు కానీ.. సోషల్ మీడియాలో అందాలతో గత్తరలేపుతుందిగా..
క్యూట్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా. నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది. జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది
Updated on: Oct 18, 2025 | 2:02 PM

క్యూట్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా. నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది. జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇదిలా ఉంటే కెరీర్ పీక్ లో ఉండగానే.. 2021లో అడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది.

ఇది జరిగిన కొన్ని నెలలకే ఈ ఇద్దరూ పెల్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆతర్వాత సోషల్ మీడియాతో బిజీగా గడిపిన మెహరీన్. 2023లో చిరంజీవ్ మక్వానాతో నిశ్చితార్థం చేసుకుంది. ఇటీవలే ఈ ఇద్దరూ హైదరాబాద్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం మెహ్రీన్ సినిమాల కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ రేంజ్లో అందరు ఆరబోస్తుంది. ఎక్కువగా వెకేషన్స్ తోనే గడుపుతుంది ఈ అమ్మడు. అందం అభినయం ఉన్నా మెహరీన్ కు ఎందుకు అవకాశాలు రావడం లేదు అని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

మెహరీన్ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే మెహరీన్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గ్లామర్ లుక్ లో అదరగొట్టింది మెహరీన్. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.