ఏంటీ బ్యూటీ డల్‌గా ఉన్నావు..ఆలోచనలో పడిపోయిన భాగ్యశ్రీ బొర్సే!
అందాల చిన్నది యూత్ కలల రాణి భాగ్య శ్రీ బొర్సే గురించి ఎంత చెప్పినా తక్కువే. కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారును మాయచేస్తుంటుంది. కానీ తాజాగా ఈ చిన్నది చాలా డల్‌గా, ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించి, తన ఫ్యాన్స్‌ను కలవరపరిచింది. అసలేమైందో తెలుసుకుందాం పదండి, మరి!
Updated on: Aug 15, 2025 | 9:00 PM

అందాల ముద్దుగుమ్మ భాగ్య శ్రీ బొర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయమే అయినప్పటికీ యూత్‌లో మాత్రం మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్య ఎవరినోట విన్నా ఈ అమ్మడు పేరే వినిపిస్తుంది. అంతలా తన అందంతో అందరినీ మాయ చేసింది ఈ బ్యూటీ.

భాగ్య శ్రీ బొర్సే మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ మూవీలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు నటన, గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఆ మూవీ రిలీజైనప్పటి నుంచి ఈ బ్యూటీ యూత్ లేటెస్ట్ క్రష్ అయిపోయింది. ఇక మూవీ విడుదలై అభిమానులను నిరాశ పరిచినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది.

దీంతో ఈ బ్యూటీ వరసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మధ్య విజయ్ దేవరకొండ సరసన, కింగ్ డమ్ మూవీలో కనిపించి మెప్పించింది. కానీ ఈ మూవీలో ఈ బ్యూటీరోల్ అంతగా లేకపోవడంతో ఈఅమ్మడుకు ఇది అంతగా కలిసిరాలేదనే చెప్పాలి.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ తన ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారును మాయ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు తాజాగా, చాలా డల్‌గా, ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ అమ్మడును చూసిన వారందరూ షాక్ అవుతున్నారు.

దీంతో ఏంటీ బ్యూటీ చాలా డల్ అయ్యావు.. ఏం ఆలోచిస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.



