- Telugu News Photo Gallery Cinema photos Actress Avika Gor and Milind Chandwani To Get married on TV, Wedding Details Out
Actress : తెలుగులో వరుస హిట్లు.. పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే..
చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. సినిమాలు, సీరియల్స్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. కానీ కొన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..? తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Updated on: Sep 22, 2025 | 2:39 PM

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవీకా గోర్. అదే సమయంలో పలు సివిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

ఆ తర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో కథానాయికగా మారింది. ఈమూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకుంది. కానీ అనుకున్నంత బ్రేక్ మాత్రం రాలేదు. యంగ్ హీరోల సరసన అనేక చిత్రాల్లో నటించింది.

అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానితో అవికా పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

గత కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఓ రియాల్టీ షోలో జంటగా పాల్గొన్న వీరు తమ ప్రేమ గురించి బయటపెట్టారు. 2020 నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. ఈ ఏడాది జూన్ లో నిశ్చితార్థం చేసుకున్నారు.

గత కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఓ రియాల్టీ షోలో జంటగా పాల్గొన్న వీరు తమ ప్రేమ గురించి బయటపెట్టారు. 2020 నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. ఈ ఏడాది జూన్ లో నిశ్చితార్థం చేసుకున్నారు.




