ఎన్నాళ్ళు ఈ ఎదురుచూపులు.. ఆఫర్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్
అను ఇమ్మాన్యుయేల్.. ఒకప్పుడు ఊపేసింది ఈ అమ్మడు. తెలుగులో ఈ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో కట్టిపడేసింది. , ఈ బ్యూటీ తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 1997 మార్చి 28న అమెరికాలో జన్మించింది. టెక్సాస్‌లోని డల్లాస్‌లో పెరిగింది.
Updated on: Oct 22, 2025 | 8:48 PM

అను ఇమ్మాన్యుయేల్.. ఒకప్పుడు ఊపేసింది ఈ అమ్మడు. తెలుగులో ఈ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో కట్టిపడేసింది. , ఈ బ్యూటీ తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 1997 మార్చి 28న అమెరికాలో జన్మించింది. టెక్సాస్‌లోని డల్లాస్‌లో పెరిగింది.

అను తండ్రి తంకచన్ ఇమ్మాన్యుయేల్, ఒక ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత. చిన్నతనంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్న అను, తన సినీ ప్రస్థానాన్ని బాలనటిగా మొదలుపెట్టింది. అను తొలిసారిగా 2011లో "స్వప్న సంచారి" అనే మలయాళ చిత్రంలో బాలనటిగా కనిపించింది.

ఆ తర్వాత, 2016లో "యాక్షన్ హీరో బిజు" అనే మలయాళ చిత్రంతో కథానాయికగా అడుగుపెట్టింది. అదే సంవత్సరంలో తెలుగులో "మజ్ను" చిత్రంలో నాని సరసన నటించి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనప్రేక్షకులను మెప్పించింది.

తర్వాత ఆమె పవన్ కళ్యాణ్‌తో "అజ్ఞాతవాసి", అల్లు అర్జున్‌తో "నా పేరు సూర్య" వంటి తెలుగు చిత్రాలలో నటించింది, అయితే ఈ చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. దాంతో తమిళ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళంలో "తుప్పరివాలన్" (2017)తో అరంగేట్రం చేసిన ఈబ్యూటీ, "నమ్మ వీట్టు పిళ్లై" (2019) చిత్రంతో కమర్షియల్ విజయం సాధించింది.

ప్రస్తుతం అను చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దాంతో సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతుంది ఈ చిన్నది. తాజాగా అను ఇమ్మాన్యుయేల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన అందంతో మరోసారి కవ్వించింది ఈ వయ్యారి భామ.