- Telugu News Photo Gallery Cinema photos Thika Sheru Photoshoot With Elephant In Thailand Vacation photos goes viral
Vithika Sheru: ఏనుగుతో వితిక జలకాలట.. మస్త్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్..
వెండితెరపై కథానాయికగా అలరించింది.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్గా మెప్పించింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వితికా షేరు.. ఆ తర్వాత యంగ్ హీరో వరుణ్ సందేశ్ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న వితికా.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3లోకి భర్తతో కలిసి అడుగుపెట్టింది.
Updated on: Jun 16, 2024 | 5:11 PM

వెండితెరపై కథానాయికగా అలరించింది.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్గా మెప్పించింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వితికా షేరు.. ఆ తర్వాత యంగ్ హీరో వరుణ్ సందేశ్ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న వితికా.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3లోకి భర్తతో కలిసి అడుగుపెట్టింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వితిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది.

నిత్యం ఏదోక ఫోటోషూట్ చేస్తూ సందడి చేస్తుంది. అలాగే జిమ్ వర్కవుడ్ వీడియోస్, చెల్లెలితో కలిసి రీల్స్, ఫ్యాషన్ ప్రమోషన్స్ ఇలా ఎన్నో అంశాలపై ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం వితికా తన చెల్లెలితో కలిసి వెకేషన్ ఏంజాయ్ చేస్తుంది.

ఈ మధ్య వరుసగా వెకేషన్స్ అంటూ బయటకు వెళ్తుంది వితికా. కొద్ది రోజుల క్రితం గోవాకు వెళ్లింది. ఇక ఇప్పుడు థాయ్ లాండ్ వెకేషన్లో సందడి చేస్తుంది. తన చెల్లితో కలిసి రోజూ క్రేజీ ఫోటోస్ నెటింట అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఏనుగుతో కలిసి నదిలో ఎంజాయ్ చేస్తూ ఫుల్ చిల్ అవుతుంది. పొట్టి డ్రెస్లో ఏనుగుతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.




