- Telugu News Photo Gallery Can a Dead Person's Fingerprint Unlock an iPhone or Android? Real Cases and Science Explained
Fingerprint sensor: చనిపోయిన వ్యక్తి ఫింగర్‌తో ఫోన్ అన్‌లాక్ చేయవచ్చా..
Fingerprint sensor technology: పెరుగుతున్న టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ ఉత్పత్తులతో కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇలా తీసుకొచ్చిన ఫీచర్స్‌తో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఒకటి. ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న ప్రతి ఫోన్ ఈ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ మన ఫోన్‌ను ఇతరులు ఓపెన్ చేయకుండా కాపాడుతుంది. అయితే ఈ ఫీచర్ గురించి చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఫోన్ యూజ్ చేస్తున్న వ్యక్తి చనిపోతే అతని ఫింగర్‌తో ఈ ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చా లేదా అని. కాబట్టి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Oct 29, 2025 | 7:11 PM

ప్రస్తుతం ప్రతి స్మార్ట్‌ఫోన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫీచర్ ఒక వ్యక్తి వేలిముద్రతో ఫోన్‌ను లాక్ చేసేందుకు అన్‌లాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ సెన్సార్లు బయోమెట్రిక్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా, ప్రతి వ్యక్తి వేలిముద్ర ప్రత్యేకంగా ఉంటుంది. మన ఫింగర్‌ను సెన్సార్‌పై పెట్టినప్పుడు అది మన వేలిముద్ర ఆకారపు డిజిటల్ చిత్రాన్ని క్రియేట్ చేసి దానిని ఫోన్‌లోని డేటాబేస్‌తో సరిపోల్చుతుంది. అప్పుడు మన ఫోన్ అన్‌లాక్ అవుతుంది. ఈ ప్రక్రియ మిల్లీసెకన్లలో జరుగుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లు ప్రధానంగా మూడు రకాల వేలిముద్ర సెన్సార్‌లను ఉపయోగిస్తాయి. వాటిలో ఆప్టికల్, కెపాసిటివ్ , అల్ట్రాసోనిక్. ఈ మూడింటిలో ప్రతి ఒక్కటి భిన్నంగా పనిచేస్తుంది. అలాగే విభిన్న ఖచ్చితత్వం భద్రతను అందిస్తుంది. అయితే వీటిలోని మొదటి రెండు సెన్సార్లు చౌకనవి వీటిని ఇన్‌బుల్ట్ డిప్‌ప్లేలలో ఉపయోగిస్తారు.

కానీ అల్ట్రాసోనిక్ సెన్సార్లు చర్మం లోపలి 3D చిత్రాలను రూపొందించడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తాయి. అవి చెమట, ధూళి లేదా తేమ, రక్త నాళాలు వంటి లక్షణాలను కూడా గుర్తించగలవు. కాబట్టి చనిపోయిన వ్యక్తిని ఫింగర్‌ను ఇవి గుర్తించగలవు

కాబట్టి చనిపోయిన వ్యక్తి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్ చేయడం చాలా కష్టం లేదా అసాధ్యం, ఎందుకంటే మరణించిన తర్వాత చర్మం ఎండిపోయి కుంచించుకుపోతుంది. వేలిముద్ర సెన్సార్‌ను సక్రియం చేయడానికి అవసరమైన కణజాలం దాని విద్యుత్ ఛార్జ్‌ను కోల్పోతుంది. దీని కారణంగా మనం ఫోన్‌ను అన్‌లాక్ చేయలేము.

అయితే ఫోన్ అన్‌లాక్ చేసే ప్రయత్నాలు మనిషి మరణించిన 12 నుండి 24 గంటల లోపు చేస్తే విజయవంతం అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ తర్వాత సెన్సార్‌ల పనితీరు ఆగిపోతుంది.( Note : పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, లేదా నివేదికల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందజేయబడినవి.. వీటిపై మీకేవైన సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.




