- Telugu News Photo Gallery Business photos Vida V1 Plus Electric Scooter Vs Ola Vs TVS Vs Bajaj Comparison, Price And Range, details here
EV Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 30 వేల తగ్గింపు.. ధర, ఫీచర్లు తెలిస్తే ఇంటికి తెచ్చేస్తారంతే.!
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే విడా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
Updated on: Mar 03, 2024 | 4:15 PM

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే విడా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.15 లక్షలు. V1 ప్రోతో పోలిస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 30 వేలు తక్కువకు లభిస్తోంది. దేశంలో ఇది ఓలా, ఏథర్, TVS, బజాజ్ వంటి కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతోంది. హీరో విడా వి1 ప్లస్ కంటే ముందు ఓలా ఎస్1 ఎయిర్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ అర్బనే లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్‌లో తమ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మరి వీటిల్లో ఏది చౌకైనది.? దేని ఫీచర్లు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు చూద్దాం.

విడా V1 ప్లస్: 3.4kWh బ్యాటరీ ప్యాక్, 100 కి.మీ రేంజ్, 5.1 గంటలలో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ సమయం, రూ.97,800 ఎక్స్-షోరూమ్ ధర

ఓలా S1 ఎయిర్: 3kWh బ్యాటరీ ప్యాక్, 151 కి.మీ రేంజ్, 5 గంటలలో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ సమయం, రూ.1,04,999 ఎక్స్-షోరూమ్ ధర

టీవీఎస్ ఐక్యూబ్: 3kWh బ్యాటరీ ప్యాక్, 100 కి.మీ రేంజ్, 4.3 గంటలలో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ సమయం, రూ.1,17,422 ఎక్స్-షోరూమ్ ధర

బజాజ్ చేతక్ అర్బనే: 2.9kWh బ్యాటరీ ప్యాక్, 113 కి.మీ రేంజ్, 4.5 గంటలలో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ సమయం, రూ.1,15,001 ఎక్స్-షోరూమ్ ధర

హీరో మోటోకార్ప్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కి.మీ సింగిల్ ఛార్జ్ రేంజ్‌తో వస్తోంది. ఇది ఫుల్ ఛార్జ్‌కి 5 గంటల 15 నిమిషాలు పడుతుంది. అలాగే మిడిల్ క్లాస్ జనాలకు ఈ స్కూటర్ వారి బడ్జెట్‌లోనే అందుబాటులో ఉంటుంది.




