Union Bank: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. యూనియన్ బ్యాంకు నుంచి కొత్త క్రెడిట్ కార్డు
Union Bank: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని కోసం నేషనల్ ..
Updated on: Feb 26, 2022 | 2:44 PM

Union Bank: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (NPCI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) రూపే క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు 50 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్‌తో వస్తుంది. ఈ కార్డు కస్టమర్‌లకు వారి వ్యాపార సంబంధిత కొనుగోళ్లపై EMI సౌకర్యాన్ని కూడా అందిస్తుంది అని సదరు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కార్డులో ప్రత్యేకంగా వ్యాపార సేవలను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ కార్డు ద్వారా వినియోగదారులు అదనంగా రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీని, త్రైమాసికానికి 2 దేశీయ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇతర రివార్డ్‌లను పొందుతారని బ్యాంక్ తెలిపింది.

ఈ క్రెడిట్ కార్డ్ వారి చెల్లింపు విధానాన్ని సులభతరం చేయడంతో పాటు వ్యాపార ఖర్చుల కోసం MSME ద్వారా నగదు ఉపసంహరణ డిమాండ్‌ను తగ్గిస్తుంది. ఇతర ఉత్పత్తులపై ఆఫర్లు కూడా పొందవచ్చు.




