- Telugu News Photo Gallery Business photos These cars are the best for young drivers, Here are the features and price details, Best cars details in telugu
Best cars: యువ డ్రైవర్లకు ఈ కార్లు చాలా బెస్ట్.. ప్రత్యేకతలు, ధర వివరాలు ఇవే..!
చాలా మంది యువకులు మంచి కారును కొనుగోలు చేయాలని, దానిలో దూర ప్రాంతాలకు పర్యటించాలని కోరుకుంటారు. ఉద్యోగాలు చేస్తున్న యువతతో పాటు వ్యాపారంలో రాణిస్తున్నవారు కూడా కారుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం మార్కెట్ లో అనేక కంపెనీల కార్లు సందడి చేస్తున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేటప్పుడు పలు విషయాలను గమనించాలి. మైలేజ్, ఆధునిక ఫీచర్లు, భద్రతా లక్షణాలు తదితర వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రధానంగా యువ డ్రైవర్ల కోసం లేటెస్ట్ ఫీచర్లు, స్టైలిష్ లుక్ తో విడుదలైన ప్రముఖ బ్రాండ్ల కార్ల వివరాలు తెలుసుకుందాం.
Srinu |
Updated on: Feb 05, 2025 | 4:30 PM

ఎలక్ట్రిక్ ఎస్ యూవీ అయిన మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కారులో అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండడంతో పాటు పనితీరు మెరుగ్గా ఉంటుంది. టెక్నాలజీ, మన్నిక కలిగిన కారు కోసం చూస్తున్నయువతకు మంచి ఎంపిక. ఈ కారు 59, 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికల్లో లభిస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 656 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. 5 స్టార్ ఎన్సీఏపీ రేటింగ్, లెవల్ 2 అడాస్ట్ సిస్టమ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కారు ధర రూ.21.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాటా టియాగో కారును ట్రాఫిక్ లో చాలా సులభంగా డ్రైవ్ చేయవచ్చు. అనుకూలమైన ధర, మెరుగైన ఇంధన సామర్థ్యం, సురక్షితమైన హ్యాచ్ బ్యాక్ కోసం చూస్తున్న యువ డైవర్లకు బాగుంటుంది. 1.2 లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఎంపికల్లో అందుబాటులో ఉంది. 86 పీఎస్ (పెట్రోలు), 73.5 పీఎస్ (సీఎన్జీ) పవర్, 20 నుంచి 26 కిలోమీటర్ల మైలేజీ, 5 స్టార్ ఎన్సీఏపీ రేటింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.5.60 లక్షల నుంచి రూ.8.20 లక్షల మధ్య ఈ కారు అందుబాటులో ఉంది.

స్టైలిష్ కారును కోరుకునే యువతకు హ్యుందాయ్ వెర్నా బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు. ఆధునిక భద్రతా ఫీచర్లతో పాటు టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. 1.5 లీటర్ టర్బో పెట్రోలు, డీజిల్ ఇంజిన్, 160 పీఎస్ వరకూ పవర్, 18 నుంచి 25 కిలోమీటర్ల మైలేజీ దీని ప్రత్యేకతలు. భద్రతకు సంబంధించి 5 స్టార్ రేటింగ్, ఆరు ఎయిర్ బ్యాగులు, అడాస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ కారు ధర రూ.11 లక్షల నుంచి రూ.17.50 లక్షల మధ్య ఉంటుంది.

ఆధునిక ఫీచర్లతో నిస్సాన్ మాగ్నెైట్ ఆకట్టుకుంటోంది. మంచి మైలేజ్, అనుకూలమైన ధర దీని ప్రత్యేకతలు. యువకులకు ఈ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ ఎంతో బాగుంటుంది. 1.0 లీటర్ల టర్బో పెట్రోలు ఇంజిన్, 100 పీఎస్ పవర్, 20 కిలోమీటర్ల మైలేజీ, 4 స్టార్ ఎన్సీఏపీ భద్రతా రేటింగ్ అదనపు ప్రత్యేకతలు. ఈ కారు రూ.6.50 లక్షల నుంచి రూ.11.50 లక్షల ధరలో అందుబాటులో ఉంది.

బెస్ట్ డిజైన్ తో తీర్చిదిద్దిన టాటా పంచ్ యువతకు చాలా బాగా నప్పుతుంది. తక్కువ ధర, అదనపు భద్రత లక్షణాలు ఈ కాంపాక్ట్ ఎస్ యూవీ ప్రత్యేకతలు. 1.2 లీటర్ పెట్రోలు ఇంజిన్, 86 పీఎస్ పవర్, 20.09 కిలోమీటర్ల మైలేజ్, 5 స్టార్ ఎన్షీఏపీ భద్రతా రేటింగ్ ఆకట్టుకుంటున్నాయి. ఈ కారు రూ.6 లక్షల నుంచి రూ.10.10 లక్షల ధరలో అందుబాటులో ఉంది.





























