- Telugu News Photo Gallery Business photos Want the best bike at a low price, These are the top five brands available in the market, Best bikes details in telugu
Best bikes: తక్కువ ధరలో బెస్ట్ బైక్ కావాలా..? మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్ ఫైవ్ బ్రాండ్లు ఇవే..!
మన దేశంలో మోటారు సైకిళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తమ అవసరాల కోసం ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. తిండి, బట్ట, ఇల్లుతో పాటు బైక్ కూడా కనీస వసతుల సరసన చేరింది. మన దేశంలో చాలా మంది సామాన్య, మధ్య తరగతి ప్రజలే ఉంటారు. వారికి వచ్చే ఆదాయాలు కూడా పరిమితంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఖరీదైన బైక్ లను కొనుగోలు చేయడం వారికి సాధ్యం కాదు. అయితే మంచి పనితీరు, అధిక మైలేజ్, స్లైలిష్ లుక్ తో ఆకట్టుకుంటూ తక్కువ ధరలో లభించే మోటారు సైకిళ్లు మార్కెట్ లో చాలా ఉన్నాయి. కేవలం లక్ష రూపాయల ధరలో అందుబాటులో ఉన్న ప్రముఖ కంపెనీల ద్విచక్ర వాహనాల గురించి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Feb 05, 2025 | 4:45 PM

దేశంలోని క్రేజీ బైక్ లలో బజాజ్ పల్సర్ 150 ముందు వరుసలో ఉంటుంది. ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన ఇంజిన్ దీని ప్రత్యేకతలు. దీనిలో 149.5 సీసీ ఇంజిన్ నుంచి 14.8 బీహెచ్పీ శక్తి విడుదల అవుతుంది. సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల మధ్య మైలేజీ వస్తుంది. గంటకు గరిష్ట వేగం 115 కిలోమీటర్లు. ఈ బైక్ రూ.99 వేల నుంచి రూ.1,04,000 ధరలో లభిస్తుంది.

స్లైలిష్ బైక్ లను కొనుకునే వారికి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 చాలా బాగుంటుంది. 160 సీసీ ఇంజిన్ తో బండి పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. గంటకు 118 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఇంజిన్ నుంచి 15.6 బీహెచ్పీ గరిష్ట శక్తి విడుదల అవుతుంది. ఈ మోటారు సైకిల్ రూ.1,05,000కు కొనుగోలు చేయవచ్చు.

స్లైలిష్ లుక్, సాలిడ్ ఫెర్మార్మెన్స్ తో యువతను యమహా ఎఫ్ జెడ్ -ఎస్ వీ3 ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రీమియం కమ్యూటర్ విభాగంలో ప్రముఖ బైక్ లా మారింది. దీనిలో 149 సీసీ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 12.4 బీహెచ్ పీ పవర్ విడుదల అవుతుంది. గంటకు గరిష్టంగా 114 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. లీటర్ పెట్రోలుకు దాదాపు 45 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ రూ.1,05,000లకు అందుబాటులో ఉంది.

పట్టణాలు, గ్రామాలతో పాటు అన్ని రకాల రోడ్లపై హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ బైక్ చక్కగా పరుగులు తీస్తుంది. ఆధునిక డిజైన్, మంచి పనితీరుతో ఆకట్టుకుంటోంది. దానికి తోడు మన దేశంలో హీరో బ్రాండ్ కు ఉన్న ఆదరణ తెలిసిందే. దీనిలోని 163 సీసీ ఇంజిన్ నుంచి 15 బీహెచ్ పీ పవర్ విడుదల అవుతుంది. దాదాపు 45 కిలోమీటర్ల మైలేజీ రావడంతో పాటు గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఈ బండి ధర రూ.1,05,000.

దేశంలోని ప్రజలు విశ్వసించే బ్రాండ్లలో హోండా ఒకటి. ఈ కంపెనీ విడుదల చేసిన హోండా సీబీ షైన్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలోని 124 సీసీ ఇంజిన్ నుంచి 10.5 బీహెచ్ పీ గరిష్ట శక్తి విడుదల అవుతుంది. దాదాపు 60 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. గంటకు 95 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేయవచ్చు. కేవలం రూ.75 వేల నుంచి 80 వేల మధ్య లభిస్తుంది.





























