- Telugu News Photo Gallery Business photos These are the electric scooters that offers range of 150km, check details in telugu,
Electric Scooters: అధిక రేంజ్.. తక్కువ ధర.. మార్కెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..
మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అధిక రేంజ్, అడ్వాన్స్ డ్ ఫీచర్లు కావాలని కోరుకుంటున్నారా? వాటి ధర కూడా అనువైన బడ్జెట్లోనే ఉండాలని ఆశిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. దీనిలో కేవలం రూ. 1.50లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఈ స్కూటర్లు అధిక రేంజ్ ను అందిస్తాయి. సింగిల్ చార్జ్ పై దాదాపు 150కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ఈ జాబితాలో ఓలా, ఏథర్ వంటి టాప్ బ్రాండ్లు ఉన్నాయి. ఆ స్కూటర్ల వివరాలు మీ కోసం..
Updated on: Feb 27, 2024 | 9:23 AM

ఓలా ఎస్1 ప్రో.. ఈ స్కూటర్ల ప్రారంభ ధర రూ. 1.30లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతాయి. దీనిలో 4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఏకంగా సింగిల్ చార్జ్ పై ఏకంగా 195 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ల అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి. హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, ట్యాంపర్ అలర్ట్ వంటివి ఉంటాయి.

ఓలా ఎస్1 ఎయిర్.. ఈ స్కూటర్లో 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది సింగిల్ చార్జ్ పై 151 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో ఉపయుక్తకరమైన ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 1.04లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.

ఏథర్ 450ఎక్స్.. ఇది ఫీచర్ రిచ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర రూ. 1.45లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ఉంది. దీనిలో 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని రెండో వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 2.9కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది సింగిల్ చార్జ్ పై 111కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

సింపుల్ డాట్ వన్.. ఇది అత్యాధునిక యాంగుల్ డిజైన్ తో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1.40లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఇది సింగిల్ చార్జ్ పై 151కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మ్యాక్స్.. ఇది మార్కెట్లో మనకు అందుకుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ. 1.15లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. 3.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 150 నుంచి 201 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.




