- Telugu News Photo Gallery Business photos These are the cars that have stolen the minds of Indians.. Low price and mileage
Budget Cars: భారతీయుల మనస్సు దోచిన కార్లు ఇవే.. తక్కువ ధరకే అదిరే మైలేజ్
భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి ఉద్యోగులు సొంత కారు కొనుగోలు చేయడం ఓ కలగా భావిస్తారు. పొదుపు చేసుకున్నంత సొమ్ముకు కారు లోన్ తీసుకుని మంచి కారును కొనుగోలు చేస్తారు. అయితే కారు కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో? దాని నిర్వహణ కూడా అంతే ముఖ్యం. అందువల్ల చాలా బడ్జెట్ ధరల్లోనే సూపర్ మైలేజ్‌ను ఇచ్చే కార్ల కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం ఆరు లక్షల లోపు మంచి మైలేజ్‌ను ఇచ్చే కార్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Nov 23, 2023 | 9:24 PM

రూ. 3.97 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టో 800 భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లల్లో ఒకటి. పెట్రోల్ ఇంజిన్ వచ్చే ఈ కారు లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అయితే ఇందులో సీఎన్‌జీ వేరియంట్ 31.5 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది.

భారతదేశంలో మారుతి సుజుకి ఆల్టో కే10 ధర రూ. 3.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఆల్టో కే10కు సంబంధించిన పెట్రోల్ వేరియంట్ 24.39 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే ఎస్ సీఎన్‌జీ వేరియంట్ 33.85 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ భారతీయ మార్కెట్లో అత్యంత అధికంగా అమ్ముడయ్యే కార్లల్లో ఒకటి. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేయాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఈ కారు అనువుగా ఉంటుంది. రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చే స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ కారు 23 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. అలాగే సీఎన్‌జీ వేరియంట్ 31 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది.

రూ. 5.84 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో వచ్చే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఇటీవల కాలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్‌లో లీటర్‌కు 21 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే సీఎన్‌జీ వేరియంట్‌లో 28 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది.

రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో 66 హెచ్‌పి పవర్, 91 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెనాల్ట్ క్విడ్ మైలేజ్ 22 కిలోమీటర్లు ఇస్తుంది. అలాగే రెనాల్ట్ క్విడ్ కారు రూ. 4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.




