- Telugu News Photo Gallery Business photos These are the best electric scooters under Rs 1 lakh, check list
Best Electric Scooters: ధర తక్కువ.. పనితీరు ఎక్కువ.. తిరుగులేని ఫీచర్లతో రూ. లక్షలోపు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
మన దేశ ఆటో ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడిప్పుడే తమ ముద్ర వేస్తున్నాయి. ద్విచక్ర వాహన శ్రేణిలో ముఖ్యంగా స్కూటర్లలో ఎలక్ట్రిక్ వేరియంట్‌కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. అత్యాధునిక ఫీచర్లతో పాటు అధిక రేంజ్ అందిస్తుండటంతో పురుషులు, మహిళలు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పలు కొత్త మోడళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. రూ. లక్షలోపు ధరలో అత్యాధునిక ఫీచర్లు, అధిక పనితీరు కనబరిచే ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఓ లుక్కేయండి..
Updated on: Aug 19, 2023 | 12:42 PM

ఆంపియర్ జీల్ ఈఎక్స్.. ఇది తక్కువ ధరలో లభించే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ. 96,690. దీనిలో 2.3కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీనిని సింగిల్‌చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ.. మీరు సరసమైన ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే బౌన్స్ ఇన్ఫినిటీ ఈ బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ. 90,000. దీనిలో రిమూవబుల్ 1.9కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ వస్తుంది. ఇది సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందిజ ఈ స్కూటర్ గంటకు 65 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్.. మన దేశంలోని మంచి ట్రాక్ రికార్డున్న కంపెనీ హీరో నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.85,190. దీనిలో 1.54కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 140 కిమీల పరిధిని అందిస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి సుమారు 5 గంటలు పడుతుంది. ఇది గంటకు 45 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్.. ఇటీవల లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999. ఈ స్కూటర్ డ్యూయల్-టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. ఓలా ఎస్1 ఎయిర్‌ని పోలి ఉంటుంది. ఇది 3కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది సింగిల్ చార్జ్ పై 151 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.దీనిలో 5-అంగుళాల సెగ్మెంటెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది.

ఒకినావా ప్రైజ్ ప్రో.. ఈ స్కూటర్ రూ.99,645 ధర ట్యాగ్‌తో వస్తుంది. సిటీ రైడింగ్ కోసం సరసమైన ధరలో స్కూటర్‌కావాలనుకొంటున్న వారికి ఇది మంచి చాయిస్. దీనిలో 2.08 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతోకూడిన బ్యాటరీ ఉంటుంది. ఇది ఫుల్ చార్జ్ అవడానికి 3 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 81 కి.మీల రేంజ్ ఇస్తుంది. గంటకు 56 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది.




