- Telugu News Photo Gallery Business photos SBI cuts home loan rates, waives processing fees here is the detail
SBI Loans: ఇల్లు కొనాలనుకుంటున్నారా.? ఇదే గోల్డెన్ ఛాన్స్.. హోం లోన్స్‌పై వడ్డీ తగ్గింపు.!
SBI Home Loans: సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా.! అయితే ఇదే మీకు గోల్డెన్ ఛాన్స్.. ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
Updated on: Sep 17, 2021 | 6:55 PM

సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా.! అయితే ఇదే మీకు గోల్డెన్ ఛాన్స్..

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోం లోన్స్ వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. పండగ సీజన్ దగ్గరపడుతుండటంతో కస్టమర్ల కోసం అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది.

దీనితో రుణగ్రహీతలు 6.7%కంటే తక్కువ రేటుతో గృహ రుణాన్ని పొందవచ్చు. అంతకముందు రుణగ్రహీతల నుండి రూ .75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలపై బ్యాంక్ 7.15% వడ్డీని వసూలు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మినహాయించాలని కూడా నిర్ణయించింది.

అలాగే జీతం లేని రుణగ్రహీతకు వర్తించే వడ్డీ రేటు.. జీతం తీసుకున్న రుణగ్రహీతకు వర్తించే వడ్డీ రేటు కంటే 15 bps ఎక్కువ ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. తద్వారా జీతం లేని రుణగ్రహీత.. జీతం తీసుకుంటున్న రుణగ్రహీత మధ్య వ్యత్యాసాన్ని SBI తొలగించింది.

అటు ఇప్పుడు, కాబోయే గృహ రుణ రుణగ్రహీతలకు వృత్తి-సంబంధిత వడ్డీ ప్రీమియం వసూలు చేయరు. జీతం లేని రుణగ్రహీతలకు 15 బిపిఎస్‌ల వడ్డీ ఆదా అవుతుంది.





























