- Telugu News Photo Gallery Business photos Rbi to issue new rs 20 banknotes with governor sanjay malhotras signature details in telugu
20 rs notes: మార్కెట్‌లోకి కొత్త రూ.20 నోట్లు? అది ఒక్కటే అసలు మార్పు
భారతదేశ కరెన్సీలో చిన్న డినామినేషన్ అయిన రూ.20 నోట్లను ఆర్‌బీఐ కొత్తవి విడుదల చేయనుంది. 2016లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన తర్వాత కరెన్సీ విషయంలో ప్రతి వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త రూ.20 నోట్లకు సంబంధించి పలు వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది.
Updated on: May 21, 2025 | 6:54 PM

20 రూపాయల నోటు అంటే ప్రజలు అధికంగా ఉపయోగించే చిన్న-విలువ నోట్లలో ఒకటి. అలాగే ఈ నోటులో భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకునే వెనుక వైపున ఎల్లోరా గుహలు వంటి మూలాంశాలతో ఉంటుంది. అయితే ఈ నోటు ఆకుపచ్చ, పసుపు కాంబినేషన్‌లో ఉంటుంది.

మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.20 డినామినేషన్ నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు.

మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద ఇప్పటికే చెలామణిలో ఉన్న రూ. 20 నోట్ల డిజైన్ ఒకేలా ఉంటుందని, ప్రజలకు సులభంగా గుర్తించేలా ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కేవలం గవర్నర్ సంతకం మార్పుతోనే ఈ నోట్లు విడుదలకానున్నాయి. ఈ మేరకు ఆర్‌బీ మే 17న ఓ ప్రకటన విడుదల చేసింది.

కొత్త నోట్ల జారీ నేపథ్యంలో గతంలో రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన అన్ని రూ.20 డినామినేషన్ నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయని కూడా స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ గవర్నర్ మారినప్పుడల్లా ఈ జారీ ప్రామాణిక ప్రోటోకాల్‌ను అనుసరిస్తుంది. అప్‌డేటెడ్ నోట్లు ప్రస్తుత గవర్నర్ సంతకంతో ఉంటాయి. సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.




