- Telugu News Photo Gallery Business photos LPG Gas Safety Tips: if gas leak from cylinder do this work immediately
LPG Gas Safety Tips: ఇంట్లో గ్యాస్ లీకైతే భయపడకండి.. వెంటనే ఇలా చేస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు..
LPG Gas Safety Tips: ప్రస్తుత కాలంలో అందరి ఇళ్లల్లో వంట కోసం ఎల్పీజీ గ్యాస్ ను ఉపయోగిస్తున్నారు. గ్యాస్‌తో వంట చేయడం చాలా సులభం. నిమిషాల్లోనే వంట పని పూర్తవుతుంది. అయితే, గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం.
Updated on: Jul 06, 2023 | 1:59 PM

LPG Gas Safety Tips: ప్రస్తుత కాలంలో అందరి ఇళ్లల్లో వంట కోసం ఎల్పీజీ గ్యాస్ ను ఉపయోగిస్తున్నారు. గ్యాస్‌తో వంట చేయడం చాలా సులభం. నిమిషాల్లోనే వంట పని పూర్తవుతుంది. అయితే, గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం. ఈ జాగ్రత్తల ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.

ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ అవుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తుంటాయి. గ్యాస్ లీక్ కారణంగా గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు జరగడం లాంటివి సంభవిస్తాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు సైతం ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయితే వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. దీనిద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు.. అవేంటో తెలుసుకుందాం...

లైటర్ ఉపయోగించవద్దు: సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అవుతుందని మీకు తెలిసిన వెంటనే.. అగ్గిపెట్టెలు, లైటర్లు లేదా ఇతర మండే వస్తువులను వెలిగించవద్దన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కాకుండా, బల్బు లేదా ట్యూబ్‌లైట్ స్విచ్‌ను ఆన్ చేయకండి. ఇలా చేస్తే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ఇంటి తలుపులు, కిటికీలను తెరవాలి. తద్వారా గ్యాస్ సాధ్యమైనంతవరకు బయటకు పోతుంది.

రెగ్యులేటర్‌ను బంద్ చేయండి: గ్యాస్ లీకేజీని గమనించిన వెంటనే రెగ్యులేటర్‌ను ఆపండి. రెగ్యులేటర్‌ను బంద్ చేసిన తర్వాత కూడా గ్యాస్ లీక్ ఆగకపోతే, సిలిండర్ నుంచి రెగ్యులేటర్‌ను వేరు చేసి.. వెంటనే రెగ్యులేటర్ ఉంచే దగ్గర సేఫ్టీ క్యాప్‌తో క్లోజ్ చేయాలి. దీంతో గ్యాస్ లీకేజీని అరికట్టవచ్చు.

గ్యాస్ లీకేజీ కారణంగా సిలిండర్‌లో మంటలు చెలరేగితే, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అలర్ట్ అవ్వండి.. భయపడకుండా తెలివిగా వ్యవహరించండి. అటువంటి పరిస్థితిలో దుప్పటి లేదా షీట్‌ను నీటిలో ముంచి.. మంటలు బయటకు వచ్చే సిలిండర్‌ను చుట్టండి. ఇలా చేయడం వల్ల మంటలను ఆర్పడానికి సహాయపడుతుంది.




