- Telugu News Photo Gallery Business photos Here are the top electric two wheelers with longest range, check list
World Environment Day 2023: జబర్‌దస్త్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఇవే.. సింగిల్ చార్జ్‌పై ఎన్ని కిలోమీటర్లో తెలిస్తే అస్సలు వదలరు..
మన దేశంలో ద్విచక్ర వాహనాలకు అధిక డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా టూ వీలర్లు కలిగి ఉన్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. అయితే గత రెండేళ్ల కాలంలో సంప్రదాయ ఇంధన ఇంజిన్ల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చి చేరుతున్నాయి. పర్యావరణ హితమైన ఈ వాహనాలను అందరూ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అధికమవుతోంది. అయితే వాటిల్లో కూడా అధిక రేంజ్ ఇచ్చే బైక్ లు, స్కూటర్లు కావాలని అందరూ కోరుకుంటున్నారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉంటే. ఈ కథనం మీకోసమే. బ్యాటరీ సింగిల్ చార్జ్ పై అదిరే రేంజ్ ఇచ్చే టాప్ టూ వీలర్లను ఇక్కడ చూసేయండి..
Madhu |
Updated on: Jun 05, 2023 | 4:00 PM

గ్రావ్ టన్ క్వాంటా.. ఇది హైదరబాదీ లోకల్ మేడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ స్కూటర్ లో స్పీడ్ వేరియంట్. గంటకు కేవలం 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలుతుంది. అయితే దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏఖంగా 320 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లలో దొరకడం కష్టం. సిటీ అవసరాల కోసం అయితే వెంటనే ఈ స్కూటర్ ని కొనుగోలు చేసేయండి.

అల్ట్రా వయోలెట్ ఎఫ్77.. అత్యధిక పనితీరుతో ఈ బైక్ అదరగొడుతుంది. స్పోర్టీ లుక్ లో కేకపెట్టిస్తుంది. దీనిలోని బ్యాటరీ రేంజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. హై ఎండ్ లుక్ కనిపిస్తున్న ఈ బైక్ సింగిల్ చార్జ్ పై ఏకంగా 307 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. మనకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లలో ఇంత రేంజ్ ఇచ్చేది ఇదొక్కటే. మంచి స్పోర్టీ లుక్ లో, అధిక పనితీరు కావాలనుకొనే వారు ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేయొచ్చు.

ఐవూమీ ఎస్1 240.. మీరు ఈ బ్రాండ్ గురించి, లేదా ఈ స్కూటర్ గురించి పెద్దగా విని ఉండరు. కానీ ఈ ఐవూమీ ఎస్1 స్కూటర్ అధిక రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించుకుంది. దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై దాదాపు 240 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఆ కంపెనీ చెబుతోంది. దీనిలో 2.5 కిలోవాట్ల హబ్ మోటార్ ఉంటుంది. అలాగే 4.2 కిలోవాట్అవర్ సామర్థ్యంతో కూడిన ట్విన్ బ్యాటరీ ప్యాక్ తో ఈ స్కూటర్ వస్తుంది.

సింపుల్ వన్.. సింపుల్ ఎనర్జీ కంపెనీ ఇటీవల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీనిలో 5 కిలోవాట్ అవర్ల సామర్థ్యంతో కూడన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఫుల్ చార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఈ స్కూటర్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

ఓలా ఎస్1 ప్రో.. మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన శ్రేణిలో ప్రస్తుతం ఓలా నంబర్ వన్ స్థానంలో ఉంది. ఓలా ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్లు వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నాయి. ఫలితంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో రారాజుగా ఓలా నిలిచింది. ఓలా ఎస్1 ప్రో స్కూటర్ సింగిల్ చార్జ్ పై 181 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 75కిలోమీటర్ల వెళ్లగలిగే అంత బ్యాటరీని చార్జ్ చేసే ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. ఇంటి దగ్గర సాధారణ చార్జర్ వినియోగించి ఆరున్నర గంటల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చు.





























