- Telugu News Photo Gallery Business photos Health Insurance New Rules On Waiting Period Pre Existing Disease Coverage Age Limit
Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్‌లో వెయిటింగ్ పీరియడ్‌పై కొత్త నిబంధనలు.. ఇక ఆ టెన్షన్ ఉండదు
ఇన్సూరెన్స్ సెక్టార్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. బీమా వినియోగం పెరగడానికి వీలుగా నిబంధనలు సవరించింది. బీమా వెయిటింగ్ పీరియడ్ తగ్గించింది. బీమా పొందేందుకు వయోపరిమితి రద్దు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం బీమా కంపెనీలు ..
Updated on: Apr 22, 2024 | 3:09 PM

ఇన్సూరెన్స్ సెక్టార్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. బీమా వినియోగం పెరగడానికి వీలుగా నిబంధనలు సవరించింది. బీమా వెయిటింగ్ పీరియడ్ తగ్గించింది. బీమా పొందేందుకు వయోపరిమితి రద్దు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం బీమా కంపెనీలు 65 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే బీమా సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ వయోపరిమితిని మార్చారు. 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా తీసుకోవచ్చు.

వెయిటింగ్ పీరియడ్ ఐదేళ్లకు తగ్గింపు - మీరు ఆరోగ్య బీమా తీసుకుంటున్నప్పుడు ముందుగా ఉన్న ఏదైనా వ్యాధిని దాచిపెట్టినట్లయితే, ఆ వ్యాధికి సంబంధించిన చికిత్స ఖర్చు ఎనిమిదేళ్ల వరకు కవర్ చేసేందుకు వీలుండదు. ఈ వెయిటింగ్ పీరియడ్ ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గింది. ఐదేళ్ల తర్వాత ముందుగా ఉన్న వ్యాధికి సంబంధించిన చికిత్స ఖర్చును బీమా కంపెనీలు తిరస్కరించలేవు.

ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించిన ఐదు సంవత్సరాల తర్వాత, బీమా కంపెనీ మీ వైద్య ఖర్చులను భరించాలి. క్లెయిమ్‌లో మోసం చేయబడిన పార్టీ విషయంలో మాత్రమే దావా తిరస్కరించబడుతుంది. పాలసీ చేసేటప్పుడు వ్యాధిని దాచిపెట్టడం వంటి సాకులు చెప్పి క్లెయిమ్‌ను తిరస్కరించడం సాధ్యం కాదు. మీరు చెల్లుబాటు అయ్యే అనారోగ్యంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లయితే.. మీలో బీపీ, షుగర్ వంటివి వెల్లడవుతాయి.

ఈ బీపీ లేదా షుగర్ మీ ఆసుపత్రిలో చేరడానికి దారితీసిన వ్యాధికి సంబంధించినది కాకపోతే బీమా కంపెనీలు మీ క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంది. అది ఇప్పుడు సాధ్యం కాదు. మీరు ఆరోగ్య బీమా కోసం దరఖాస్తు చేసుకుంటే, ముందుగా ఉన్న వ్యాధుల గురించి సమాచారం అడుగుతారు. బీపీ, షుగర్ , ఆస్తమా వంటి జబ్బులు ఏవైనా ఉంటే చెప్పాలి.

ఇలాంటి వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీలు నాలుగేళ్లపాటు భరించవు. ప్రస్తుతం ఈ వ్యవధిని మూడేళ్లకు తగ్గించారు. అంటే ప్రీమియం చెల్లించిన మూడేళ్ల తర్వాత, బీమా కంపెనీలు మీకు ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజీని అందించాల్సి ఉంటుంది.




