- Telugu News Photo Gallery Business photos Gold prices drop in India.. Prices recorded on September 19 at 7 pm
Gold Rates: మహిళలకు ఇది కదా శుభవార్త.. భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు
మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా బంగారం కొనుగోళ్లు భారీగానే జరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యల సమయాల్లో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి..
Updated on: Sep 19, 2024 | 7:04 PM

మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా బంగారం కొనుగోళ్లు భారీగానే జరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యల సమయాల్లో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇక గతంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పతనం అయ్యాయి. ఇక ఇటీవల నుంచి మళ్లీ బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటికి ఇప్పటికి భారీగా తగ్గింది.

ఈ నేపథ్యంలో తాజాగా సెప్టెంబర్ 19వ తేదీన రాత్రి 7 గంటల సమయానికి బంగారం ధరలు భారీగానే దిగి వచ్చాయి. తుం బంగారంపై రూ.280 వరకు దిగి వచ్చింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,250 ఉండగా, అదే 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.74,450 ఉంది.

ఇక దేశంలోని ప్రధాన నగరాలలో 7 గంటల సమయానికి ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,600 వద్ద కొనసాగుతోంది.

Gold Price

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,450 వద్ద కొనసాగుతోంది.


ఇక దేశంలో బంగారం బాటలోనే వెండి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి వెండి ధర కూడా భారీగా పెరిగింది. సెప్టెంబర్ 19న రాత్రి 7 గంటల సమయానికి రూ.91,000 వద్ద ఉంది. అదే చెన్నై, హైదరాబాద్, కేరళలో రూ.96,000 కొనసాగుతోంది. ఇక ఒక్క బెంగళూరులో కిలో వెండి ధర రూ.85,000 వద్ద ఉంది.




