- Telugu News Photo Gallery Business photos Full josh in the market november month too, Those bikes and cars release, Upcoming cars and bikes details in telugu
Upcoming cars and bikes: వచ్చే నెలలోనూ మార్కెట్‌లో ఫుల్ జోష్.. ఆ బైక్‌లు, కార్లు రిలీజ్..?
దేశంలో ప్రస్తుతం ఫెస్టివల్ జోష్ ఉత్సాహంగా నడుస్తోంది. ముఖ్యంగా దీపావళి పండగ త్వరలో రానుంది. ప్రతి ఒక్కరూ పండగ సందర్భంగా షాపింగ్ లు చేస్తూ బిజీగా ఉన్నారు. కార్లు, మోటారు సైకిళ్లు కొనుగోలు చేస్తూ సందడి చేస్తున్నారు. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిక్కిరిసి ఉంటున్నాయి. అయితే దీపావళి తర్వాత కూడా మార్కెట్ లో సందడి కొనసాగనుంది. పలు ప్రముఖ కంపెనీలు తమ కార్లు, మోటారు సైకిళ్లను నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ కొత్త వాహనాలతో కళకళలాడనుంది. వచ్చే నెలలో విడుదలయ్యే కొత్త మోటారు సైకిళ్లు, కార్లు ఇవే..!
Updated on: Oct 30, 2024 | 3:48 PM

మారుతీ సుజుకీ చెందిన నెక్స్ జెన్ డిజైర్ కారు నవంబర్ 11న విడుదల కానుంది. సన్ రూఫ్, కొత్త ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, న్యూ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. మారుతీ స్విస్ట్ ఇంజిన్ ను దీనిలోనూ ఏర్పాటు చేశారు. మాన్యువల్, ఆటో మేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఎంపికలతో 1.2 లీటర్ మూడు సిలిండర్ ఇంజిన్ తో తీసుకువచ్చారు.

హీరో మోటోకార్ప్ రూపొందించిన హీరో డెస్టినీ 125 స్కూటర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనిలో 124.6 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 9 హెచ్ పీ, 10.4 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. రీఫ్రెష్ డిజైన్ తో కొత్త ఫీచర్లతో రానున్నట్టు సమాచారం. నవంబర్ లో మార్కెట్ లోకి రానున్న ఈ స్కూటర్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

రాయల్ ఎన్ ఫీల్డ్ బేర్ 650 బైక్ కు నవంబర్ ఐదో తేదీన మార్కెట్ లోకి రానుంది. ఇటీవల బయటకు వచ్చిన చిత్రాల ద్వారా దాని ప్రత్యేకతలు వెల్లడయ్యాయి. చంకియర్ టైర్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, కొత్త సీటు, రివైజ్డ్ పిలియన్ గ్రాబ్ రైల్స్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 648 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో ఈ బండి వస్తుందని భావిస్తున్నారు.

బ్రిక్స్టన్ మోటారు సైకిల్ కంపెనీ నుంచి నవంబర్ లో నాలుగు బైక్ లు విడుదల కానున్నాయి. వీటికి క్రాస్ ఫైర్ 500 ఎక్స్, క్రాస్ ఫైర్ 500 ఎక్స్ సీ, క్రోమ్ వెల్ 1200, క్రోమ్ వెల్ 1200 ఎక్స్ అని పేర్లు పెట్టారు. క్రాస్ ఫైర్ వాహనాలు 500 సీసీ ఇన్ లైన్ టూ సిలిండర్ 4 హర్ప్ ఇంజిన్ తో శక్తిని పొందుతాయి. క్రోమ్ వెల్ బైక్ లలో 1200 సీసీ వాటర్ కూల్డ్ ఇన్ లైన్ ట్విన్ సిలిండర్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 81 హెచ్ పీ శక్తి విడుదలవుతుంది. ఈ వాహనాలకు సంబంధించి ప్రీ బుక్కింగ్ లు గత వారం మొదలయ్యాయి.

స్కోడా కంపెనీ తయారు చేసిన మొదటి సబ్ 4 మీటర్ ఎస్ యూవీ కైలాక్ కారు నవంబర్ 6న దేశంలో విడుదల అవుతుంది. విక్రయాలు మాత్రం 2025లో ప్రారంభమవుతాయి. దీనిలో 1.0 లీటర్ మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు లోపలి భాగం కుషాక్ ను పోలి ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా, అడాస్ సూట్ తదితర అదనపు ప్రత్యేకతలతో రానుంది.




