- Telugu News Photo Gallery Business photos Facelifted Audi Q5 Launched In India From Rs 58.93 Lakh Onwards
Audi Q5 Car: మార్కెట్లో విడుదలైన ఆడి క్యూ5 కారు.. అత్యాధునిక ఫీచర్స్.. ధర ఇతర వివరాలు..!
Audi Q5 Car: ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న కార్ల తయారీ కంపెనీలు సరికొత్త..
Updated on: Nov 24, 2021 | 1:05 PM

Audi Q5 Car: ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న కార్ల తయారీ కంపెనీలు సరికొత్త వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

ఇక తాజాగా జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడి మరో అడుగు ముందుకేసింది. ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఎస్‌యూవీ క్యూ5 కారును మార్కెట్లో విడుదల చేసింది.

ఐదు సీట్లతో ఈ కారును తయారు చేసింది. అంతేకాకుండా ఈ కారు టెక్నాలజీ, ప్రీమియం ప్లస్ పేరిట రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్‌సింగ్ థిల్లాన్ పేర్కొన్నారు.

ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.63,77 లక్షలు, రూ.58.93 లక్షలు. ఈ సంవత్సరం ఆడి కంపెనీ మార్కెట్లో విడుదల చేసిన వాహనాల్లో తొమ్మిదోది. ఇది 2.0 లీటర్ల టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజన్, ఎనిమిది ఎయిర్ బ్యాగులు, ఇంకా మరెన్నో ప్రత్యేకతలున్నాయి.




