- Telugu News Photo Gallery Business photos EV cars are ruling the market, nothing compares to them in terms of speed and looks, EV Cars details in telugu
EV Cars: మార్కెట్‌ను శాసిస్తున్న ఈవీ కార్లు… స్పీడ్ అండ్ లుక్స్‌లో వీటికి ఏవీ సాటిరావంతే
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. గతంలో కేవలం ఈవీ స్కూటర్లు మాత్రమే అధిక ప్రజాదరణ పొందగా ఇటీవల కాలంలో ఈవీ కార్లు కూడా అప్‌డేటెడ్ వెర్షన్లతో రావడం ఈ కార్లను ఇష్టపడే వారి సంఖ్య క్రమేపి పెరుగుతుంది. సరికొత్త బ్యాటరీ అప్‌డేట్స్‌తో పాటు వేగవంతమైన ఛార్జింగ్ వల్ల మైలేజ్ పెరగడంతో ఈవీ కార్ల సేల్స్ పెరిగాయి. ముఖ్యంగా పెట్రో వాహనాలకు ధీటుగా కొన్ని ఈవీ కార్లు స్పీడ్ అండ్ లుక్స్‌లో అదరగొడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టాప్ ఫైవ్ ఈవీ కార్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Apr 02, 2024 | 6:00 PM

రిమాక్ నెవెరా సూపర్ ఈవీ కారు ఎలక్ట్రిక్ మోటార్లు 1,914 బీహెచ్‌పీ పవర్‌తో వస్తుంది. ఈ కారు 2,360 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 1.74 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఈ కారు 415 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. రిమాక్ ఆటోమొబిలిటీకు సంబంధించిన క్రొయేషియన్ కార్ కంపెనీ ఈ కారు తయారు చేస్తుంది.

పినిన్పారినా బాటిస్టా ఈవీ కారు 1877 బీహెచ్‌పీ పవర్, 2,300 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 1.89 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఈ కారు గరిష్ట వేగం 350 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ కారు బ్యాటరీ ప్యాక్ రిమాక్ ద్వారా సరఫరా చేస్తుంది. ఈ కారు మొత్తం కార్బన్ ఫైబర్తో తయారు చేశారు. పినిన్ఫారినా బాటిస్టా ఓ స్టైలిష్ కారు అని ప్రపంచవ్యాప్తంగా పేరుంది.

అమెరికన్ ఈవీ కార్ మేకర్ అయిన లూసిడ్ లూసిడ్ ఎయిర్ సఫెర్ పేరుతో మొట్టమొదటి ఈవీ కారును రిలీజ్ చేసింది. టెస్లా మోడల్ ఎస్‌కు పోటీగా ఈ కారును రిలీజ్ చేశారు. ఈ కారులో ఉండే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో 1,234 బీహెచ్‌పీ పవర్, 1,939 ఎన్ఎం టార్క్ న్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 1.89 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఈ కారు 330 కిలో మీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది.

పోర్స్చే టైకాన్ టర్బో జీటీ అనేది టైకాన్‌కు సంబంధించిన విప్లవాత్మక ఎడిషన్ టర్బో జీటీ కారు 1,019 బీహెచ్‌పీ పవర్‌తో 1,340 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 2.1 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఈ కారు గంటకు 305 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

టెస్లా మోడల్ ఎస్ టెస్లాస్‌కు చెందిన ప్లాయిడ్ వెర్షన్ 1,020 బీహెచ్‌పీ పవర్‌తో 1,420 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.1 సెకన్లలో 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.





























