AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIM Card: ఇండియాలో ఎక్కువమంది ఏ సిమ్ వాడుతున్నారో తెలుసా..?

ఇండియాలో ఎక్కువమంది వాడుతున్న సిమ్ కార్డు ఏంటో మీకు తెలుసా.. ప్రధానంగా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్ఎల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. వీటిల్లో ఏ నెట్‌వర్క్‌ను ఎక్కువమంది వాడుతున్నారనేది తెలుసుకోవాలంటే.. ట్రాయ్ విడుదల చేసే డేటా చూడాల్సిందే.. జులైలో డేటా విడుదల చేసింది

Venkatrao Lella
|

Updated on: Dec 09, 2025 | 4:51 PM

Share
ఇటీవల ప్రతీఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఫోన్ వాడాలంటే సిమ్ కార్డు అనేది తప్పనిసరి. సిమ్ లేకపోతే మీరు ఇంటర్నెట్, కాలింగ్, బ్యాంకింగ్ యాప్స్ అనేక సర్వీసులు పొందలేరు. కొత్త ఫోన్ తీసుకునేటప్పుడే సిమ్ కార్డు లేనివారు కొత్తది తీసుకుంటారు.  ప్రస్తుతం మార్కెట్లో అనేక టెలికాం కంపెనీలు సిమ్ కార్డులు అందిస్తు్న్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఏ సిమ్ కార్డును ఎక్కువ ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం.

1 / 5
ఇండియాలో ప్రధానంగా నాలుగు టెలికాం కంపెనీలు లీడింగ్ పొజిషన్‌లో ఉన్నాయి. అవే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్. ఒక్క బీఎస్ఎన్‌ఎల్ తప్పితే మిగతావి మూడు ప్రైవేట్ కంపెనీలే. ఇండియాలో ఎక్కువమంది ఏ నెట్‌వర్క్‌ను వాడుతున్నారో తెలుసుకోవాలంటే.. టెలికాం రెగ్యూలేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసే నెలవారీ సబ్‌స్కైబర్ల డేటా చూడాలి.
 జులైలో ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఎక్కువమంది వాడుతున్న నెట్‌వర్క్‌లలో తొలి స్థానంలో జియో ఉంది.

ఇండియాలో ప్రధానంగా నాలుగు టెలికాం కంపెనీలు లీడింగ్ పొజిషన్‌లో ఉన్నాయి. అవే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్. ఒక్క బీఎస్ఎన్‌ఎల్ తప్పితే మిగతావి మూడు ప్రైవేట్ కంపెనీలే. ఇండియాలో ఎక్కువమంది ఏ నెట్‌వర్క్‌ను వాడుతున్నారో తెలుసుకోవాలంటే.. టెలికాం రెగ్యూలేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసే నెలవారీ సబ్‌స్కైబర్ల డేటా చూడాలి. జులైలో ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఎక్కువమంది వాడుతున్న నెట్‌వర్క్‌లలో తొలి స్థానంలో జియో ఉంది.

2 / 5
జులై నాటికి దేశవ్యాప్తంగా జియో సిమ్‌ను 47.45 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు.  జులైలో కొత్తగా 4.82 కస్టమర్లు జియోలోకి వచ్చారు. ఇక తర్వాతి స్థానంలో ఎయిర్‌టెల్ కొనసాగుతోంది. జులై నాటికి 39.14 కోట్ల మంది కస్టమర్లు ఈ నెట్‌వర్క్‌కు ఉన్నారు.

3 / 5
ఇక ఎయిర్‌టెల్ తర్వాత వొడాఫోన్ ఐడియా ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ కొనసాగుతోంది.  ఆర్ధిక ఇబ్బందులు వల్ల వొడాఫోన్ ఐడియాకు కస్టమర్లు తగ్గిపోతున్నారు. నెట్‌వర్క్ స్లోగా ఉండటం, 5జీని లాంచ్ చేయడంలో ఆలస్యం కావడంతో వొడాఫోన్ ఐడియా నుంచి జియో, ఎయిర్‌టెల్ నెట్వర్క్‌కు చాలామంది మారిపోయారు.

4 / 5
డేటా చవక, ఫాస్ట్ 5జీ స్పీడ్‌లో జియో ముందుంది. ఇక కాల్ క్వాలిటీ, నెట్‌వర్క్ స్పీడ్‌లో ఎయిర్‌టెల్ ముందు వరుసలో ఉంది. ఇవన్నీ చూస్తే ఎయిర్‌టెల్, జియోనే భారత టెలికాం రంగాన్ని శాసిస్తున్నాయని చెప్పవచ్చు.

5 / 5