- Telugu News Photo Gallery Business photos Discounts of up to Rs 81,500 on Mahindra Alturas G4, XUV300, and Scorpio in February 2022
Mahindra Cars: మహీంద్రా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. భారీగా తగ్గింపు
Mahindra Cars: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఫిబ్రవరి నెల వరకు పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు వెల్లడించింది. కొత్త కారు కొనుగోలు చేసేవారికి ఇది ..
Updated on: Feb 22, 2022 | 6:15 PM

Mahindra Cars: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఫిబ్రవరి నెల వరకు పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు వెల్లడించింది. కొత్త కారు కొనుగోలు చేసేవారికి ఇది మంచి అవకాశం.

ఎక్స్‌యూవీ300, స్కార్పియో, అల్ట్రాస్ జీ4, బొలెరో, మరాజో మోడళ్లపై డిస్కౌంట్‌లలో సొంతం చేసుకోవచ్చు. బొలెరో ఎస్‌యూవీపై రూ.15 వేల వరకు ఎక్ఛేంజ్ బోనస్, రూ.6 వేలు డిస్కౌంట్, రూ.3 వేల కార్పొరేట్ తగ్గింపు ప్రకటించింది.

మరాజో మూడు వేరియంట్లలో కూడా ఆఫర్లను ప్రకటించింది. M2, M4 ప్లస్, M6 ప్లస్ వేరియంట్లపై రూ.20వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రూ.15వేలు ఎక్ఛేంజ్ బోన్ రూ.5,200 కార్పొరేట్ బెనిఫిట్ పొందవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కాంపాక్ట్ ఎస్‌యూవీ రూ.30వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్ఛేంజ్ బోనస్ రూ.25వేలు, కార్పొరేట్ రూ.4వేలు తగ్గింపు, ఇతర ఆఫర్లు రూ.10 వేల వరకు పొందవచ్చు.

మహీంద్రా ఆల్ట్రాస్ జీ4పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎక్ఛేంజ్ బోనస్ రూ.50వేలు, కార్పొరేట్ తగ్గింపు రూ.11,500, అదనపు ఆఫర్లు రూ.20 వేల వరకు పొందవచ్చు.




