Date Fruits: రోజుకో ఖర్జూరం పండు తింటే.. డాక్టర్‌తో పనే ఉండదిక! ఎన్ని లాభాలో..
ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాలు.. ప్రకృతి సహజంగా లభించే తీపి పదార్థం. అంతేకాదు, ఇది పోషక విలువలకు నిలయం కూడా. రోజూ ఓ ఖర్జూరం తినడం వల్ల శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది..
Updated on: Aug 22, 2025 | 7:03 PM

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే వీటిని ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఖర్జూరాలు శరీరానికి చాలా మంచివి. ఖర్జూరాలు.. ప్రకృతి సహజంగా లభించే తీపి పదార్థం. అంతేకాదు, ఇది పోషక విలువలకు నిలయం కూడా. రోజూ ఓ ఖర్జూరం తినడం వల్ల శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది.

ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపును శుభ్రపరచడానికి, మలబద్ధకం సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకంఉడా ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి6, ఐరన్ శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి.

ఖర్జూరాలు శరీరంలో రక్త ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. అవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఓ ఖర్జూరం పండు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తి లభిస్తాయి. ఖర్జూరంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఖర్జూరంలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. ఖర్జూరంలో లభించే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది.




