- Telugu News Photo Gallery Spiritual photos Guru's Transit and Sakata Yoga: Negative impact on these zodiac signs
Sakata Yoga 2025: దుస్థానాల్లో గురువు.. శకట యోగంతో ఈ రాశులవారు జాగ్రత్త!
Guru Transit: జ్యోతిషశాస్త్రం ప్రకారం మీ రాశికి దుస్థానాల్లో గురువు సంచారం చేస్తున్నప్పుడు శకట యోగం కలుగుతుంది. ఈ యోగం వల్ల ఎక్కువగా దుష్ఫలితాలే కలుగుతాయి. డబ్బు నష్టపోవడం, నమ్మినవారు మోసం చేయడం, ఉద్యోగం కోల్పోవడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం కాకపోవడం, వైఫల్యాలు ఎక్కువగా ఉండడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ప్రస్తుతం ఈ యోగం మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర రాశుల వారికి కలిగింది. ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్న గురువు ఈ రాశిలో వచ్చే ఏడాది జూన్ 2వ తేదీ వరకు కొనసాగుతున్నందువల్ల ఈ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
Updated on: Aug 22, 2025 | 7:28 PM

మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి శకట యోగం కలిగింది. ధన కారకుడైన గురువు తృతీయ స్థానంలో బాగా బలహీనపడడం జరుగుతుంది. ఫలితంగా ఆర్థిక విషయాల్లో జీవితం గతుకుల బాట మీద సాగుతున్నట్టుగా ఉంటుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉండకపోవచ్చు. రాబడిలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ట్రేడింగ్ వగైరాల్లో డబ్బు నష్టపోవడం జరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసి రాకపోవచ్చు. ఉద్యోగంలో జీతభత్యాలు కానీ, వృత్తి, వ్యాపారాల్లో రాబడి గానీ పెరగకపోవచ్చు. ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పిల్లల నుంచి సమస్యలు తలెత్తుతాయి. సంతాన యోగం కలగకపోవచ్చు. కుటుంబ పెద్దలతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.

కన్య: గ్రహ సంచారంలో గురువుకు దశమ స్థానం ఏమాత్రం శుభప్రదం కాదు. గురువు దశమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు సాధారణంగా ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, పదోన్నతులు ఆగిపోవడం, ఉద్యోగం మారాల్సి రావడం వంటివి జరుగుతాయి. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కూడా మందకొడిగా సాగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉంటుంది.

వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లతో ఇబ్బంది పడతారు. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోవడానికి అవకాశం ఉంది. పిల్లలతో ఇబ్బందులు తలెత్తుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి.

మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో గురువు సంచారం వల్ల శకట యోగం ఏర్పడింది. ఎంత శ్రమపడ్డా ఆదాయం పెరగకపోవచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు, పెట్టుబడులకు తగ్గ రాబడి అందకపోవచ్చు. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో అకారణ వైరాలు తలెత్తుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు.



