- Telugu News Photo Gallery These are the zodiac signs whose troubles will be removed due to the influence of Saturn
శని ప్రభావం.. కష్టాల నుంచి బయటపడనున్న రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే? శని గ్రహం శుభ స్థానంలో ఉంటే అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయి. కానీ నీచ స్థానంలో ఉంటే, వారికి ఉండే కష్టాలు, బాధలు వర్ణనాతీతం. అయితే శని ఒక రాశిలో రెండున్నర ఏళ్లు ఉంటాడు. తర్వాత మరో రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే శని మీన రాశి సంచారం వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Aug 22, 2025 | 6:42 PM

శని గ్రహం మీన రాశిలో సంచారం చేయనున్నాడు.దీని వలన నాలుగు రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉండటమే కాకుండా అన్ని విధాలా కలిసి వస్తుందంట. కాగా,శని సంచారం వలన ఏ రాశులకు లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

కుంభ రాశి : కుంభ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం రావడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది.

సింహ రాశి : సిహ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం.

మిథున రాశి : శని గ్రహం మీన రాశిలోకి సంచారం వలన ఈ రాశి వరకు2027 వరకు అద్భుతంగా ఉండబోతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా అవి త్వరగానే తీరిపోతాయంట. ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది.

తుల రాశి : తుల రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. వ్యాపారల్లో , స్టాక్ మార్కెట్‌లో వీరికి కలిసి వస్తుంది. అనుకోనిప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. అవి మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి.



