BJP: ఎన్నికలపై దూకుడు పెంచుతున్న బీజేపీ.. ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనేదానిపై సమావేశం
సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీట్ల కేటాయింపు కోసం చర్యలు ప్రారంభించింది. అయితే ఎవరెవరికి సీట్లు కేటాయించాలనే దానిపై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో పార్టీలోని పలువురులు కీలక నేతలు సమావేశమయ్యారు. ఇందులో సిట్టింగ్ ఎంపీల పనితీరు గురించి సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలు ఏజేన్సీ సంస్థల నుంచి క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తు్నట్లు సమాచారం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
